బిగ్ బాస్ 5 గ్రాండ్ లాంచ్ కి అంతా రెడీ.. మహేష్ సాంగ్ తో షణ్ముఖ్ ఎంట్రీ, ఏంట్రా ఇది అంటున్న నాగ్

First Published Sep 5, 2021, 11:25 AM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించే బిగ్ బాస్ 5 తెలుగు షోకి అంతా సిద్ధం అయింది. నేడు(ఆదివారం) సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ షో గ్రాండ్ గా లాంచ్ కానుంది.

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించే బిగ్ బాస్ 5 తెలుగు షోకి అంతా సిద్ధం అయింది. నేడు(ఆదివారం) సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ షో గ్రాండ్ గా లాంచ్ కానుంది. దీనితో స్టార్ మా సంస్థ వరుసగా ప్రోమోలు రిలీజ్ చేస్తూ ప్రచారం కల్పిస్తున్నారు. 

తెలుగులో బిగ్ బాస్ షోకి విశేషంగా ప్రేక్షకాదరణ లభిస్తోంది. తొలి రెండు సీజన్ లకు ఎన్టీఆర్, నాని హోస్ట్ లుగా చేశారు. మూడవ సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా కంటిన్యూ అవుతున్నారు. కింగ్ నాగార్జున తన స్టైల్, యాటిట్యూడ్, వాక్ చాతుర్యంతో విజయవంతంగా బిగ్ బాస్ ని నడిపిస్తున్నారు. 

బిగ్ బాస్ 5పై రెట్టింపు అంచనాలు ఏర్పడ్డాయి. గత ఏడాదిన్నర కాలంగా కరోనా, లాక్ డౌన్ లాంటి పరిస్థితులతో థియేటర్స్ కి కూడా జనం వెళ్లడం లేదు. ఏ నేపథ్యంలో బిగ్ బాస్ కి ఆదరణ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. 

తాజాగా స్టార్ మా రిలీజ్ చేసిన ప్రోమోలో నాగ్ 'ఇక్కడ టన్నుల కొద్దీ కిక్ ఉంటుంది' అని అన్నారు. ఈసారి బిగ్ బాస్ గత నాలుగు సీజన్ల కంటే భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

బిగ్ బాస్ 5పై ఎక్స్ క్లూజివ్ గా ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఈ బిగ్ బాస్ లో యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ పాల్గొన బోతున్న సంగతి తెలిసిందే. ప్రతి కంటెస్టెంట్ హౌస్ లోకి డాన్స్ పెర్ఫామెన్స్ తో ఎంట్రీ ఇవ్వనున్నారు. షణ్ముఖ్ మహేష్ బాబు 1 నేనొక్కడినే చిత్రంలోని 'హూ ఆర్ యు' సాంగ్ కి డాన్స్ పెర్ఫామెన్స్ ఇవ్వబోతున్నాడట. 

షణ్ముఖ్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేముందు.. నాగార్జున అతడితో 1 నేనొక్కడినే చిత్రంలోని 'ఏంట్రా ఇది' అనే డైలాగ్ తో ఆటపట్టించనున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఎంట్రీ అదిరిపోనున్నట్లు టాక్. 

యాంకర్ రవి, యూట్యూబర్ సరయు, యానీ మాస్టార్, సీరియల్ హీరో మానస్, ఆర్జే కాజల్, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, సీరియల్ నటి ప్రియ, నటరాజ్ మాస్టార్, నటి శ్వేత వర్మ, లహరి కంటెస్టెంట్స్ గా ఎంపికయ్యారు. 

click me!