ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ 18 గ్రాండ్ ఫినాలే నేడు ప్రసారం కానుంది. వివియన్ డిసేనా, అవినాష్ మిశ్రా, కరణ్ వీర్ మెహ్రా, ఈషా సింగ్, చుమ్ దారంగ్ టాప్ 5 కంటెస్టెంట్లు. మాజీ కంటెస్టెంట్లు అంకితా లోఖండే, విక్కీ జైన్ సెట్‌లో క్యాజువల్ డ్రెస్‌లో కనిపించారు. వివియన్ డిసేనా, రజత్ దలాల్ మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందని మన్నారా చోప్రా అంచనా వేశారు. ఆమె కరణ్‌వీర్‌ను కూడా ప్రశంసించింది.
మన్నారా మాట్లాడుతూ, `కరణ్‌వీర్ బాగా ఎంటర్‌టైన్ చేశాడు. కానీ చివరికి వివియన్, రజత్ మధ్య పోటీ ఉంటుంది. నటుడా లేక సోషల్ మీడియా క్రియేటరా ? ఎవరు గెలుస్తారో చూద్దాం. చాలా ఆసక్తికరంగా, ఉత్సాహంగా ఉంది` అని అన్నారు.