Bigg Boss Telugu 10: అవమానించిన బిందు మాధవి చేతుల మీదగానే ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శెట్టి..!

Published : Sep 06, 2026, 10:33 PM ISTUpdated : Sep 07, 2026, 09:39 AM IST

Bigg Boss Telugu 10: అగ్నిపరీక్ష సీజన్ 2లో అదరగొట్టి.. ఎక్కువ మంది ప్రేక్షకుల మనసులను గెలిచిన రోహిత్ నాయుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. అవమానించిన బిందు తోనే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

PREV
13
అగ్ని పరీక్షలో సత్తా చాటిన రోహిత్..

తెలుగు బుల్లితెర హిస్టరీలోనే అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్ బాస్' పదవ సీజన్ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా సమాన అవకాశం కల్పిస్తూ నిర్వహించిన 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' టాస్కుల్లో తన సత్తా చాటి, కోట్లాది మంది వెళ్లాలని కోరుకునే బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు రోహిత్ నాయుడు పట్నం

23
ఎవరీ రోహిత్ నాయుడు?

తెలుగు రాష్ట్రాలకు చెందిన రోహిత్ నాయుడు... అగ్ని పరీక్షలో.. అతను ఆడిన ఆటకు ఎక్కువ మంది ఫిదా అయ్యారు. అందరిలా.. గొడవలు పడకుండా..చాలా కామ్ గా, కంపోజ్డ్ గా ఉంటూ.. అందరి మనసులు గెలిచాడు. హౌస్ లోకి అడుగుపెట్టే ముందు.. వాటర్ గ్లాస్ ఇచ్చి.. అది ఎవరి ముఖం మీద అయినా కొట్టమని నాగార్జున ఆర్డర్ చేయగా.. తాను ఆ పని చేయలేను అని రోహిత్ చెప్పడం విశేషం.

అగ్ని పరీక్ష సెలక్షన్స్ సమయంలో.. బింధు మాధవి.. రోహిత్ ముఖంపై రెండు గ్లాసుల నీరు కొట్టి అవమానించింది. కానీ.. రోహిత్ చాలా మౌనంగా ఉన్నాడు తప్ప.. సీరియస్ అవ్వలేదు. రియాక్ట్ కూడా అవ్వలేదు. ఎవరైతే తనను ఆ రోజు అవమానించారో.. ఆమె చేతే పొగిడించుకొని.. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టడం విశేషం.

33
'అగ్నిపరీక్ష' దాటి బిగ్ బాస్ హౌస్‌కి!

కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లడం అంత సులువు కాదు. వేలాది మంది పోటీదారులను దాటుకుని 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' షోలో అడుగుపెట్టిన రోహిత్.. ఫిజికల్ టాస్కులు, మెంటల్ గేమ్‌లలో మైండ్ బ్లాకింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నిర్వాహకులు పెట్టిన ప్రతి కఠినమైన పరీక్షను తట్టుకుని, తన స్ట్రాంగ్ ఆటిట్యూడ్‌తో ప్రేక్షకుల మనసులు గెలిచాడు.

కామన్ మ్యాన్ పవర్ చూపిస్తాడా?

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, కేవలం తన టాలెంట్, డెడికేషన్‌తో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన రోహిత్ నాయుడు, సెలబ్రిటీ కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. సామాన్యుల తరఫున హౌస్‌లో అడుగుపెట్టిన ఈ యూత్ ఫుల్ కంటెస్టెంట్ ఎంతవరకు నిలబడతాడో, తన గేమ్ ప్లాన్‌తో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి!

Read more Photos on
click me!

Recommended Stories