Temper Vamsi: చిరంజీవిపై ఇష్టంతో ఫిల్మ్‌ నగర్‌ కష్టాలు.. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో కోణం చూపిస్తానంటున్న టెంపర్‌ వంశీ

Published : Sep 06, 2026, 10:03 PM IST

విలన్‌ పాత్రలతో పాపులర్‌ అయ్యాడు వంశీ. `టెంపర్‌` మూవీ అయనకు విశేష గుర్తింపు తెచ్చిపెట్టింది. దీంతో ఆ మూవీనే ఇంటిపేరుగా మార్చుకున్నారు. ఇప్పుడు ఆయన బిగ్‌ బాస్‌ తెలుగు 10లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా టెంపర్‌ వంశీ బ్యాక్‌ గ్రౌండ్‌ చూస్తే.

PREV
15
బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి టెంపర్‌ వంశీ

నెగటివ్‌ రోల్స్ తో పాపులర్‌ అయిన టెంపర్‌ వంశీ తాజాగా బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెట్టారు. ఆయన అనేక చిత్రాల్లో విలన్‌గా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ `టెంపర్‌` మూవీలో విలన్‌ గా నటించగా, అందులో ఆయన పాత్రకి విశేషమైన గుర్తింపు వచ్చింది. అంతా టెంపర్‌ వంశీగా పిలవడం స్టార్ట్ చేశారు. దీంతో తన ఇంటి పేరునే టెంపర్‌ వంశీగా మార్చుకున్నారు. అయితే ఇటీవల వంశీకి సరైన పాత్రలు రావడం లేదు. ఈ క్రమంలో బిగ్‌ బాస్‌ షోలో తానేంటో నిరూపించుకోవాలని భావించారు. మళ్లీ తాను బౌన్స్ బ్యాక్‌ కావాలనే ప్రయత్నం చేస్తున్నారు. మరి టెంపర్‌ వంశీకి సంబంధించిన నేపథ్యం చూస్తే..

25
అసలు పేరు వంశీకృష్ణారెడ్డి.. సినిమానే ఇంటి పేరు

టెంపర్‌ వంశీ అసలు పేరు వంశీకృష్ణారెడ్డి అలియాస్‌ అజయ్‌. చిరంజీవి సినిమాలను చూసి ఆయనపై అభిమానం పెంచుకున్నారు. అదే సినిమాల్లోకి తీసుకొచ్చింది. చిరంజీవికి సంబంధించిన ప్రతి ఫోటోని ఆల్బమ్‌ చేసుకున్నారు వంశీ. ఆ తర్వాత ఫిల్మ్ నగర్‌ వచ్చి తన ఫోటోలు పట్టుకొని ప్రొడక్షన్‌ ఆఫీసుల చుట్టూ తిరిగారు. ఈ క్రమంలో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఆ తర్వాత ఓ రోజు పూరీ జగన్నాథ్‌ కంట్లో పడ్డారు. ఆయన పిలిచి వేషం ఇచ్చి ఆరు వందల రూపాయలు ఇస్తానని చెప్పారట. అలా వంశీ లైఫ్‌ మారిపోయింది. ఆ తర్వాత నెగటివ్‌ రోల్స్ తో మెప్పించారు. విలన్‌గా పేరు తెచ్చుకున్నారు. జూ. ఎన్టీఆర్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టెంపర్‌’ సినిమాలో కీలకమైన నెగిటివ్‌ పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్‌ తమ్ముడి పాత్రలో కనిపించిన వంశీ తన విలనిజంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా తర్వాతే ఆయన ‘టెంపర్‌ వంశీ’గా ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

35
వరుసగా విలన్‌, క్యారెక్టర్‌ పాత్రలు

‘టెంపర్‌’ తర్వాత వంశీకి వరుసగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ‘అత్తారింటికి దారేది’, ‘భరత్‌ అనే నేను’, ‘సాహో’, ‘భీష్మ’, ‘వకీల్‌ సాబ్‌’, ‘హిట్‌ 2’, ‘దేవర’ వంటి సినిమాల్లో ఆయన విలన్‌గా కనిపించారు. ‘పుష్ప: ది రైజ్‌’, ‘టైగర్‌ నాగేశ్వరరావు’, ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ , ‘చోర్‌ బజార్‌’, ‘బుజ్జి ఇలారా’, ‘హిట్‌ 2’ వంటి చిత్రాల్లోనూ ఆయన నటించారు. విలన్‌గా, సహాయ నటుడిగా, నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రల్లో కనిపిస్తూ టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

45
ఇప్పుడు బిగ్‌బాస్‌లో అసలు ఆట!

సినిమాల్లో ఎక్కువగా విలన్‌ పాత్రల్లో కనిపించిన టెంపర్‌ వంశీ.. నిజ జీవితంలో ఎలా ఉంటారన్నది ఇప్పుడు బిగ్‌బాస్‌ ద్వారా ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఇప్పటివరకు వెండితెరపై నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. బిగ్‌బాస్‌ హౌస్‌లో మాత్రం తన అసలు వ్యక్తిత్వాన్ని ఎలా చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఈ షోని తాను మళ్లీ కమ్‌బ్యాక్‌ అయ్యేందుకు వాడుకోబోతున్నారు. మరి షోలో ఎంత వరకు ఆకట్టుకుంటారు? అనేది చూడాలి.

55
విలన్‌ కాదు, తనలోని మరో కోణం చూపిస్తానని చెప్పిన వంశీ

బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి అడుగుపెడుతున్న సందర్భంగా వంశీ మాట్లాడుతూ, తాను సినిమానే జీవితంగా మలుచుకున్నట్టు తెలిపారు. కట్టే కాలే వరకు సినిమా సినిమా సినిమానే అని తెలిపారు. తనకు ఇప్పటి వరకు నెగటివ్‌ రోల్స్ మాత్రమే వచ్చాయని వాటితోనే అలరించానని, తనని నెగటివ్‌గానే చూస్తున్నారని, కానీ తన అసలైన వ్యక్తిత్వాన్ని చూపించాలనుకుంటున్నట్టు తెలిపారు. తనకంటూ ఒక కుటుంబం ఉంటుందని, తనకంటూ ఎమోషన్స్ ఉంటాయని, తనలోని మరో కోణాన్ని ఇందులో ఆవిష్కరించబోతున్నట్టు తెలిపారు వంశీ. అంతేకాదు టెంపర్‌ వంశీ నుంచి వంశీ అని పిలిపించుకోవాలనుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా స్టేజ్‌ పై అదిరిపోయే డాన్సులతో అలరించారు వంశీ.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories