వైల్డ్ కార్డ్ లో బిగ్‌ ట్విస్ట్, ఐదుగురు కాదు 9 మంది, అడ్డుకోలేకపోయినా హౌజ్‌మేట్స్

First Published | Sep 26, 2024, 11:39 PM IST

వైల్డ్ కార్డ్ లో బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. ఐదుగురు వైల్డ్ కార్ద్ ద్వారావస్తారనే ప్రచారం నడుస్తుంది. కానీ తాజా ఎపిసోడ్‌ లో మాత్రం అదిరిపోయే షాక్‌ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. 
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 వ సీజన్‌ నాల్గో వారం విజయవంతంగా రన్‌ అవుతుంది. అయితే ఈ వారం అంతగా కిక్‌ ఇవ్వడం లేదు. నామినేషన్లలో రచ్చ చేసిన కంటెస్టెంట్లు ఆ తర్వాత ఆ ఊపుచూపించడం లేదు. టాస్క్ లో కూల్‌గా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో బిగ్‌ బాస్‌ కూడా ఈ వారం రచ్చ చేసే టాస్క్ లు పెద్దగా ఇవ్వడం లేదు. దీంతో షో అంత ఇంట్రెస్టింగ్‌ గా సాగడం లేదు. అయితే హౌజ్‌లో సోనియా చుట్టూ లవ్‌ ట్రాక్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. పృథ్వీరాజ్‌తో, నిఖిల్‌తో ఆమె పులిహోర కలుపుతూనే ఉంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇంకోవైపు యష్మిని సీన్‌లోకి లాగుతున్నారు. విష్ణు ప్రియా సైతం పృథ్వీతో పులిహోర కలిపే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు అందరు కలిసి నాగమణికంఠని ఆడుకుంటున్నారు. ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా 25వ రోజు ఎపిసోడ్‌లో కూడా అదే జరిగింది. సర్వైవల్‌ ఆఫ్‌ ది ఫిటెస్ట్ లో వీక్‌ కంటెస్టెంట్‌ని తొలగించాలనే టాస్క్ బిగ్‌ బాస్‌ ఇచ్చినప్పుడు శక్తి టీమ్‌ మణికంఠని పక్కన పెట్టాలనుకున్నారు.

అయితే వాళ్లు ఆలోచిస్తుండగానే వాళ్లు తన పేరు తీయడంతో తనే ముందుగా తప్పుకుంటున్నట్టు మణికంఠ చెప్పడంతో ఆ విషయం వివాదంగా మారింది. నువ్వే చెప్పావని శక్తి టీమ్‌, కావాలని తప్పించారని కాంతార టీమ్‌ వాదించింది. అయితే కాంతార టీమ్‌ నుంచి నబీల్‌ని తొలగించడంతో ఈ వివాదం రాజుకుంది. 


ఇందులో అందరు కలిసి మణికంఠని టార్గెట్‌ చేయడంతో ఆ బాధ తట్టుకోలేక ఏడ్చేశాడు మణికంఠ. మైక్‌ని విసిరి కొట్టి రూమ్‌లోకి వెళ్లిపోయాడు. సోనియా, యష్మిలతో గట్టిగానే వాదించారు. కానీ వాళ్లిద్దరు మణికంఠని గట్టిగా కార్నర్‌ చేస్తున్నారని అర్థమవుతుంది. ఆ తర్వాత నబీల్‌ ముందు తన గోడుని వెల్లబోసుకున్నాడు మణికంఠ.

మాట్లాడాలంటేనే భయమేస్తుందని తెలిపారు. నబీల్‌ ఇచ్చిన ఎంకరేజ్‌, ఎనర్జీతో మళ్లీ కలిసిపోయాడు. అయితే మొత్తంగా అందరు మణికంఠని టార్గెట్‌ చేయడం అనేది అది పరోక్షంగా ఆయన్ని హీరో చేస్తున్నారని అర్థమతుంది. ఆయన చుట్టూ కంటెంట్‌ తిరుగుతున్న నేపథ్యంలో తనే హీరో అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

మరోవైపు సర్వైవల్‌ ఆఫ్‌ ది ఫిటెస్ట్ టాస్క్ లో ఐదు రౌండ్లు జరిగాయి. ఇందులో ఒకటి కాంతార టీమ్‌, రెండు శక్తి టీమ్‌ గెలిచింది. ప్రైజ్‌మనీని పెంచింది. ఈ గేమ్‌ లో భాగంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలను వీళ్లు అడ్డుకోవాల్సి ఉంటుంది. 12మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలలో ఎంత మందిని తగ్గిస్తారో అది వారికి సేఫ్‌గా ఉంటుందనేది బిగ్‌ బాస్‌ గేమ్‌. అయితే ఇందులో కేవలం మూడు మాత్రమే గెలిచారు.

మూడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలను అడ్డుకున్నారు. ఈ లెక్కన వైల్డ్ కార్డ్ ద్వారా మరో తొమ్మిది మంది వస్తారా? అనే చర్చ ప్రారంభమైంది. ఐదుగురిని వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకురాబోతున్నారని, ఇందులో మాజీ కంటెస్టెంట్లే ఉంటారని ప్రచారం జరిగింది. అవినాష్‌, రోహిణి, హరితేజ, శోభా శెట్టి రాబోతున్నారని తెలుస్తుంది. కానీ గురువారం ఎపిసోడ్‌లో బిగ బాస్‌ చెప్పిన దాన్ని బట్టి చూస్తే తొమ్మిది మంది వస్తారా? అనే సందేహం కలుగుతుంది. మరి ఏం చేయబోతున్నారనేది చూడాలి. 
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ సెప్టెంబర్‌ 1 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. నాగార్జున హోస్ట్ గా ఈ షో నడుస్తుంది. ఇందులో14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. బేబక్క, శేఖర్‌ బాషా, అభయ్‌ నవీన్‌, నిఖిల్‌, యష్మి, ఆదిత్య ఓం, ప్రేరణ, మణికంఠ, పృథ్వీరాజ్‌, నబీల్‌, నైనిక, కిర్రాక్‌ సీత, విష్ణు ప్రియా, సోనియా హౌజ్‌లోకి వచ్చారు.

వీరిలో బేబక్క, శేఖర్‌ బాషా, అభయ్‌ ఎలిమినేట్అయ్యారు ప్రస్తుతం 11 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. నాల్గో వారం సోనియా, ప్రేరణ, మణికంఠ, ఆదిత్య ఓం, పృథ్వీరాజ్‌, విష్ణు ప్రియా నామినేషన్‌ లో ఉన్నారు. వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారో చూడాలి. 

Latest Videos

click me!