అనసూయ వివాదంలో కొత్త ట్విస్ట్.. రష్మికి పెరుగుతున్న మద్దతు.. వామ్మో ఇదెక్కడి రచ్చ !

Published : Aug 28, 2022, 03:10 PM ISTUpdated : Aug 28, 2022, 03:13 PM IST

హాట్‌ యాంకర్‌ అనసూయ చేసిన కామెంట్లు ఇటీవల వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఆమెని నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. వారికి అంతే ఘాటుగా సమాచారం చెప్పింది అనసూయ. అయితే ఈ వివాదంలోకి రష్మిని లాగడం, ఆమెకి మద్దతు పెరుగుతుండటం హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

PREV
17
అనసూయ వివాదంలో కొత్త ట్విస్ట్.. రష్మికి పెరుగుతున్న మద్దతు.. వామ్మో ఇదెక్కడి రచ్చ !
Anasuya Bharadwaj

అనసూయ(Anasuya) `లైగర్‌`(Liger) సినిమా విషయంలో చేసిన కామెంట్లు వివాదంగా మారిన విషయం తెలిసిందే. `అమ్మని అన్న ఊసురు ఊరికే పోదు` అంటూ ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది. అయితే `లైగర్‌`ని ఉద్దేశించే అనసూయ అన్నదనే విషయం అందరికి స్పష్టమవుతుంది. `అర్జున్‌రెడ్డి` సమయంలో సినిమాలోని తల్లిపై చేసిన కామెంట్లపై ఆమె రియాక్ట్ అయిన విషయం తెలిసిందే. 
 

27

ఇప్పుడు మరోసారి దాన్ని గుర్తు చేస్తూ ఆమె సంచలన కామెంట్లు పెట్టడంతో విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda) అభిమానులు రెచ్చిపోయారు. ఆమెని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. బూతు ప్రయోగాలు చేశారు. `ఆంటీ` యాష్‌ ట్యాగ్‌తో ఆడుకున్నారు.దీనికి అనసూయ కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యింది. స్ట్రాంగ్‌ కౌంటర్లిస్తూ వచ్చింది. ఈ విషయంలో తాను తగ్గేదెలే అని చాటుకుంది. తాను స్ట్రాంగ్‌ ఉమెన్‌ అనే విసయాన్ని మరోసారి తెలియజేసింది. 
 

37

ఇదిలా  ఉంటే అనసూయ విషయంలో రష్మి(Rashmi Gautam)కి మద్దతు పెరుగుతుండటం ఇప్పుడు సర్వత్రా హాట్‌ టాపిక్‌ అవుతుంది. విజయ్‌ దేవరకొండ ఫ్యాన్సే కాదు, సాధారణ నెటిజన్లు కూడా రష్మిక సపోర్ట్ గా తయారవుతున్నారు. ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అనసూయ ఇలాంటి విషయాల్లో నోరు జారుతుందని,ఆమెకి దూకుడెక్కువని, కాంట్రవర్సీలకు అనసూయ కేరాఫ్‌గా నిలుస్తుందంటున్నారు. 
 

47

అదే సమయంలో Anchor Rashmi ఈ విషయంలో చాలా డీసెంట్‌ అని, అసలు ఆమె వివాదాలకు పోదని పోస్టు లు పెడుతున్నారు. ఎలాంటి కామెంట్లపై కూడా తాను స్పందించదని, అసలు వాటిని పట్టించుకోదని, తన పనేదో తాను చూసుకుంటూ వెళ్లిపోతుందని, ఇదే అభిమానులకు బాగా నచ్చే అంశమని అంటున్నారు. తన లిమిట్స్ ఏంటో తనకు తెలుసు అని, హుందాగా వ్యవహరిస్తుందని ఆమెని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. 
 

57

అయితే ఇందులోనూ కొంత సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. అసలు మ్యాటర్‌ ఏంటంటే జనాలు వేసే పంచ్‌లు రష్మికి అర్థం కావని, తెలుగు ఆమెకి అర్థం కాదని, అందుకే ఆమె సైలెంట్‌గా ఉంటుందని పంచ్‌లేస్తున్నారు. తనని ఏమన్నా పడుతుందని, కానీ కుక్కల జోలికెళ్తే మాత్రం చంద్రముఖి బయటకొస్తుందంటూ సెటైర్లు వేస్తుండటం గమనార్హం. మొత్తంగా విజయ్‌ దేవరకొండ అభిమానులంతా రష్మి వైపు మళ్లారనే విషయం స్పష్టమవుతుంది. అయితే ఇవన్నీ చూసిన రష్మి `పండగ చేస్కోండి` అంటూ కామెంట్లు పెట్టడం విశేషం.

67

సోషల్‌ మీడియాలో యూత్‌లో మంచి ఫాలోయింగ్‌, క్రేజ్‌ విషయంలో అనసూయని మించిన వారు లేరంటారు. ఆమె హాట్‌ ఫోటోలతో ఇంటర్నెట్‌లో దుమ్మురేపుతుంటుంది. అదే ఆమె క్రేజ్‌కి కారణమంటుంటారు. అయితే రష్మి సైతం గ్లామర్‌ ఫోటోలు పంచుకుంటుంది. కానీ అనసూయ రేంజ్‌లో కొంటెపనులు చేయదని, చాలా హుందాగా వ్యవహరిస్తుందని, అందుకే రష్మిది సెపరేట్‌ ట్రాక్‌ అని అంటుంటారు. హాట్‌ నెస్‌ విషయంలో అనసూయని మించి పొందుతుందని చెబుతుంటారు.
 

77

ఏదేమైనా తనకు సంబంధం లేని అనసూయ వివాదంలోకి రష్మిని లాగడం పట్ల ఆమె అభిమానులు మాత్రం పెదవి విరుస్తున్నారు. ఆ రోచ్చు మాకెందుకు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అందులోకి మమ్మల్ని లాగొద్దని చెబుతున్నారు. ఇక ప్రస్తుతం రష్మి `జబర్దస్త్`తోపాటు `ఎక్స్ ట్రా జబర్దస్త్`, `శ్రీదేవి డ్రామా కంపెనీ`లకు హోస్ట్ గా చేస్తుంది. అనసూయ వదిలేసి `జబర్దస్త్`ని, సుధీర్‌ వదిలేసిన `శ్రీదేవి డ్రామా కంపెనీ`లకు తనే యాంకర్‌గా చేస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories