#Liger:తన కామెంట్స్ పై క్షమాపణ చెప్పిన విజయ్ దేవరకొండ

First Published Aug 28, 2022, 1:56 PM IST

నా సినిమాని కూడా బాయ్ కాట్ చేస్తారా ? చూసుకుందాంరా అంటూ సవాల్ విజయ్ దేవరకొండ విసిరాడు. ఈ సవాల్ తో మరింతగా కష్టాలు వచ్చి పడ్డాయి.    మరింతగా వైరల్ అయ్యేలా చేసారు బాయ్ కాట్ అంశాన్ని. ఇప్పుడీ సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో విజయ్ దేవరకొండపై ఓ రేంజిలో ట్రోల్స్ వస్తున్నాయి.


లైగర్ ని విజయ్ దేవరకొండ రెండున్నరేళ్ల పాటు మోశాడు. కానీ విజయ్ దేవరకొండ అతి నమ్మకాన్ని లైగర్ నిలబెట్టుకోలేదు. సినిమా రిలీజ్ అయిన గంటల్లోనే సినిమాకి డివైడ్ టాక్ రావడం విజయ్ దేవరకొండ ని తీవ్రంగా నిరాశపరిచింది. లైగర్ రిజల్ట్ విజయ్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ప్రభావం విజయ్ ని చాలాకాలం వెంటాడే సూచనలు ఉన్నాయి. ఈ సినిమాని కొన్న ఓ థియేటర్ యజమాని విజయ్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు.  లైగర్ హిందీ వర్షన్ నెగెటివ్ టాక్ తో భారీగా నష్టపోయింది. విపరీతమైన హైప్ క్రియేట్ కావడంతో రెట్టింపు ధరలు చెల్లించి కొన్న బయ్యర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపధ్యంలో విజయ్ దేవరకొండ దిగి వచ్చి ఓ డిస్ట్రిబ్యూటర్ కు క్షమాపణ చెప్పటం ఆశ్చర్యం కలిగించే విషయమే.

liger

 
ఈ క్రమంలో ముంబైకి చెందిన మనోజ్ దేశాయ్ అనే థియేటర్ యజమాని విజయ్ దేవరకొండను తిట్టిపోశాడు. ముంబైకి చెందిన ఓ థియేటర్‌ ఓనర్‌. ఆయన పేరు మనోజ్‌ దేశాయ్‌. ఈయన ముంబైలోని ప్రముఖ గైటీ గెలాక్సీ, మరాఠా మందిర్‌ సినిమా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌.


 మనోజ్ దేశాయ్ తాజా ఇంటర్వ్యూలో.. లైగర్ విడుదలకు ముందు విజయ్ చేసిన కొన్ని కామెంట్స్ ఓపెనింగ్స్ ని తీవ్రంగా దెబ్బతీశాయి అన్నారు. . "మిస్టర్‌ విజయ్‌ నువ్వు అహంకారిగా మారినట్లున్నావు. మీ ఇష్టం ఉంటే సినిమా చూడండి లేదంటే లేదు అనే కామెంట్స్‌ ప్రభావం నువ్వు చూడలేదా. ఆడియెన్స్‌ చూడకపోతే ఆమిర్‌ఖాన్‌, అక్షయ్‌కుమార్‌, తాప్సీల పరిస్థితి చూడు. లైగర్‌పై నాకు చాలా భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఇలాంటి కామెంట్స్‌ ప్రభావం చూపుతాయి. ఇలాంటి పనులు ఎవరూ చేయకూడదు" అని మనోజ్‌ అన్నాడు.


నెపో కిడ్ అనన్య పాండే హీరోయిన్ కావడం, కరణ్ జోహార్ నిర్మాతగా ఉండడంతోపాటు ప్రెస్ మీట్స్ లో విజయ్ దేవరకొండ చూపించిన యాటిట్యూడ్ నచ్చని నెటిజెన్స్ బాయ్ కాట్ లైగర్ హ్యాష్ ట్యాగ్ ను ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు. అదే టైంలో విజయ్ దేవరకొండ కావాలంటే నా సినిమా బాయ్ కాట్ చేసుకోండి, నచ్చితేనే చూడండి అంటూ మాట్లాడాడు. ఇవీ మూవీపై ఎఫెక్ట్ చూయించాయని ఆయన ఆరోపించాడు.


 నీలానే మా సినిమాను కావాలంటే బాయ్ కాట్ చేసుకోండని చెప్పి అమీర్ ఖాన్, తాప్సి, అక్షయ్ కుమార్ నష్టపోయారు. నీ పొగరు వలన లైగర్ కి ఓపెనింగ్స్ దక్కలేదంటూ మనోజ్ తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోశారు. ప్రస్తుతం మనోజ్ దేశాయ్ ఇంటర్వ్యూ జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది.


ఈ నేపధ్యంలో  మనోజ్ దేశాయ్‌ని ముంబైలో కలిశాడు విజయ్. అంతే కాదు, క్షమాపణ కూడా చెప్పాడు. సినిమాని ఇంకా బాగా ప్రమోట్ చేస్తాననీ, తన వల్ల దొర్లిన తప్పుకి క్షమాపణ చెబుతున్నాననీ అన్నాడు. విజయ్ క్షమాపణ పట్ల మనోజ్ దేశాయ్ హర్షం వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమ, థియేటర్ల వ్యవస్థ ఇబ్బందుల్లో పడిందనే తన ఆవేదన అని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, ‘లైగర్’ సినిమా తెలుగు నాట డిజాస్టర్ అయినా, హిందీలో ఫర్వాలేదనిపిస్తోంది.


ఇక విజయ్ దేవరకొండ ఈ సినిమా హిట్ అయితే సెలెబ్రేషన్స్, పార్టీ వెకేషన్స్ అంటూ రిలాక్స్ అయ్యేవాడే.. కానీ ఇప్పుడు విజయ్ తన తదుపరి మూవీస్ జన గణ మన, ఖుషి చిత్రాల కోసం రంగంలోకి దిగిపోతున్నాడు. లైగర్ రిలీజ్ అయిన రెండో రోజే జిమ్ లో కసరత్తులు స్టార్ట్ చేసి షాకిచ్చాడు.
 

ఏదైమైనా  విజయ్ దేవరకొండ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై స్టార్ హీరోగా అవతరించబోతున్నాడు అంటూ అంతటి భారీ అంచనాలు మోస్తున్న వచ్చిన చిత్రం 'లైగర్'. పూరి జగన్నాధ్ ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా మనసు పెట్టి లైగర్ చిత్రాన్ని రూపొందించారనేది అబద్దం అని తేలిపోయింది. విజయ్ దేవరకొండ అయితే ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టేశాడనేది నిజం.  

click me!