బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ప్రారంభమై ఎనిమిది వారాలు అవుతుంది. 15 మంది కంటెస్టెంట్లతో సెప్టెంబర్ 7న ఈ షో ప్రారంభమైన విషయం తెలిసిందే. మధ్యలో దివ్య మిడ్ వీక్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ద్వారా మరో ఆరుగురు కంటెస్టెంట్లు హౌజ్‌లోకి వచ్చారు. అప్పటికే ఐదుగురు కంటెస్టెంట్లు హౌజ్‌ని వీడారు. ఇప్పటి వరకు హౌజ్ నుంచి ప్రియా శెట్టి, శ్రష్టి వర్మ, రమ్య మోక్ష, హరిత హరీష్, మర్యాద మనీష్, ఫ్లోరా సైనీ, శ్రీజ వంటి వారు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఎనిమిదవ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ వారం మాధురి, తనూజ, సంజనా, రీతూ చౌదరీ, గౌరవ్, కళ్యాణ్, పవన్, రాము రాథోడ్ నామినేషన్‌లో ఉన్నారు.