Sundeep kishan Mazaka first day collections shocks everyone in telugu
సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా త్రినాథ్ రావ్ నక్కిన (Trinadha Rao) దర్శకత్వంలో ‘మజాకా’ (Mazaka) సినిమా శివరాత్రి సందర్బంగా బుధవారం (ఫిబ్రవరి 26న) రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రీతూ వర్మ (Ritu Varma) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ‘మన్మధుడు’ ఫేమ్ అన్షు (Anshu Ambani) కూడా కీలక పాత్ర పోషించింది.
ప్రసన్న కుమార్ బెజవాడ (Prasanna Kumar) ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే అందించారు. టీజర్, ట్రైలర్స్ బాగానే ఉన్నాయి. సినిమాలో మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కామెడీ ఉంటుందని రివ్యూలు వచ్చాయి. అయితే ఓపినింగ్ కలెక్షన్స్ ట్రేడ్ ని షాక్ ఇచ్చిందని తెలుస్తోంది.
23
Sundeep kishan Mazaka first day collections shocks everyone in telugu
శివరాత్రి పండగ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ సినిమా అనుకున్న స్దాయిలో లో గ్రోత్ ని చూపించ లేదు. క్లాస్ సెంటర్లలో ఓపినింగ్స్ రాబట్టలేకపోయిన ఈ సినిమా మాస్ సెంటర్స్ లో ఆక్యుపెన్సీ పర్వాలేదు అనిపించేలానే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 80 లక్షల రేంజ్ నుండి 1 కోటి రేంజ్ లో షేర్ వచ్చిందని చెప్తున్నారు.
1.2-1.4 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేసిన ట్రేడ్ కు నిరాశే ఎదురైంది. అయితే ఇవి అఫీషియల్ లెక్కలు కావు. ట్రేడ్ లో వినిపిస్తున్నవి మాత్రమే. ఈ సినిమా స్దాయికి ఇది బాగా తక్కువే. అయితే కాసేపు నవ్వుకోవచ్చు అనే టాక్ స్ప్రెడ్ అయితే వీకెండ్ కు కలెక్షన్స్ ఊపందుకునే అవకాశం ఉంది. డే 1 కలెక్షన్స్ మాత్రం డల్ గానే ఉన్నాయని అంటున్నారు.
33
Sundeep kishan Mazaka first day collections shocks everyone in telugu
మరో ప్రక్క డబ్బింగ్ సినిమా అయినా డ్రాగన్ ...భాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది. ఇదే డైరక్టర్ చేసిన ధమాకా కు రిలీజ్ కు ముందే పాటలు సూపర్ హిట్ అవటం, శ్రీ లీల ఫ్యాక్టర్, రవితేజ కామెడీ టైమింగ్ బాగా హెల్ప్ చేసాయి. అయితే ఈ సినిమాకు అవేమీ లేవు.
సందీప్ కిషన్, రావు రమేష్ కామెడీ ఫస్టాఫ్ లో బాగున్నా..సెకండాఫ్ లో సోసో అనటంతో ఇనానమస్ హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. దాంతో ఆ టాక్ కలెక్షన్స్ పై పడింది. వీకెండ్ కనుక సినిమా కలెక్షన్స్ రైజ్ కాకపోతే కొన్నవారికి నష్టాలు తప్పవు. ఈ లోగా ప్రమోషన్స్ పెంచి పాజిటివ్ బజ్ సినిమాపై తేవాల్సిన అవసరం ఉంది