ఢీ అంటే ఢీ అంటోన్నమహేష్‌, పవన్‌, ప్రభాస్‌, వెంకీ, విజయ్‌.. ఫ్యాన్స్ ఆందోళన.. ఈ సారి బాక్సాఫీసు రణరంగమే!

First Published Jul 31, 2021, 8:23 PM IST

ప్రభాస్‌, మహేష్‌, పవన్‌ కళ్యాణ్‌ తగ్గేదెలే అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చేది లేదంటున్నారు. మేకర్స్ సైతం వారితో సై అంటున్నారు. అంతా బాగానే ఉన్నారు. ఇప్పుడు అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఇంతకి ఏం జరగబోతుంది.

టాలీవుడ్‌కి బిగ్గెస్ట్ సినిమా పండగ అంటే సంక్రాంతి అనే చెప్పాలి. సంక్రాంతికి మూడు నాలుగు చిన్నా, పెద్ద సినిమాలు విడుదలవుతుంటాయి. బాగున్నా సినిమాలు భారీ కలెక్షన్లని కొల్లగొడుతుంటాయి. ఫర్వాలేదనిపిస్తే మాత్రం కలెక్షన్ల విషయంలో పోటీపడుతుంటాయి. ఇటీవల కాలంలో ఒకటి రెండు పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు మిక్స్ డ్ గా వచ్చి సంక్రాంతి పండుగని ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఫుల్‌ఫిల్‌ చేశాయి. గతేడాది సంక్రాంతికి మహేష్‌ `సరిలేరు నీకెవ్వరు`, బన్నీ `అలా వైకుంఠపురములో` చిత్రాలు విడుదలయ్యాయి. రెండూ భారీ కలెక్షన్లని వసూలు చేశాయి. అదే సమయంలో బాక్సాఫీసు వద్ద రెండూ నువ్వా నేనా అన్నట్టు సాగాయి. చాలా వరకు కలెక్షన్లు పంచుకున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం సీన్‌ వేరేలా ఉండబోతుంది. వచ్చే సంక్రాంతికి గట్టిపోటీ ఉండేలా ఉంది.
undefined
వచ్చే సంక్రాంతి మాత్రం కనీ వినీ ఎరుగని రీతిలో థియేటర్లలో భారీ సినిమాలు పోటీపడబోతున్నాయి. ఇంకా చెప్పాలంటే నువ్వా నేనా అంటూ ఢీ కొట్టేందుకు రెడీ అవుతున్నాయి. 2022 సంక్రాంతి మూడు భారీ సినిమాలు బరిలోకి దిగాయి. పవన్‌ కళ్యాణ్‌-రానా కలిసి నటిస్తున్న రీమేక్‌ చిత్రం, ప్రభాస్‌ పాన్‌ ఇండియా చిత్రం `రాధేశ్యామ్‌`, మహేష్‌ నటిస్తున్న `సర్కారు వారి పాట` సంక్రాంతికి రాబోతున్నట్టు ప్రకటించారు.

Prabhas

ఇందులో మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌లో పవన్‌-రానా కలిసి నటిస్తున్నారు. సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, త్రివిక్రమ్‌, కథనం, మాటలు అందిస్తున్నారు. ఇందులో పవన్‌తో నిత్యా మీనన్‌ నటిస్తుంది. భీమ్లా నాయక్‌ అనే పోలీస్‌ పాత్రలో పవర్‌స్టార్‌ కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్టు ఇటీవల చిత్ర బృందం మేకింగ్‌ గ్లింప్స్ సందర్భంగా అనౌన్స్ చేసింది.
undefined
ఇదిలా ఉంటే పవన్‌ నటిస్తున్న మరో సినిమా కూడా సంక్రాంతి బరిలోనే ఉంది. క్రిష్‌ డైరెక్షన్‌ లో రూపొందుతున్న `హరిహర వీరమల్లు` చిత్రం కూడా సంక్రాంతికే రిలీజ్‌ చేయబోతున్నట్టు గతంలో ప్రకటించారు. అయితే ప్రస్తుతం మరో సినిమాతో ఆయన సంక్రాంతికి రాబోతుండటంతో ఆ సినిమా వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. దీంతో పవన్‌తో పవన్‌ పోటీని తప్పించే ప్రయత్నం చేస్తున్నారట.
undefined
Prabhasమరోవైపు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ సైతం సంక్రాంతిని టార్గెట్‌ చేయడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ఆయన నటిస్తున్న `రాధేశ్యామ్‌` చిత్రం జులై 30న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు జనవరి 14న ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియాగా ఐదు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో రిలీజ్‌ చేయబోతున్నారు. అయితే ఇతర భాషల రిలీజ్‌ టైమ్‌ని చూసుకుని సంక్రాంతికి దిగారట ప్రభాస్‌. అన్ని భాషల్లో ఇదే కరెక్ట్ టైమ్‌ అని భావించారట.

Prabhas

ఓ వైపు పవన్‌ కళ్యాణ్‌, మరోవైపు ప్రభాస్‌ సినిమాలు అనౌన్స్ చేసినప్పటికీ తమ సినిమా రిలీజ్‌ డేట్‌లో ఏమాత్రం మార్పు లేదని ప్రకటించాడు సూపర్‌ స్టార్‌ మహేష్‌. ఆయన నటిస్తున్న `సర్కారువారి పాట`ని కూడా సంక్రాంతికే రిలీజ్‌ అని తాజాగా అనౌన్స్ చేశాడు. ఇది జనవరి 13న రిలీజ్‌ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Mahesh Babu

ఈ మూడు సినిమాలతోపాటు వెంకటేష్‌, వరుణ్‌ కలిసి నటించిన `ఎఫ్‌3` సినిమాని కూడా సంక్రాంతికే రిలీజ్‌కి రెడీ అవుతున్నారట నిర్మాత దిల్‌రాజు. సంక్రాంతి సీజన్‌ లో దిల్‌రాజు బ్యానర్‌ నుంచి వచ్చినసినిమాలు మంచి విజయం సాధించాయి. `ఎఫ్‌2` కూడా రెండేళ్ల క్రితం సంక్రాంతికే వచ్చి వంద కోట్లు వసూలు చేసింది. దానికి సీక్వెల్‌గా, అదే కాంబినేషన్‌లో, అనిల్‌ రావిపూడి దర్శకత్వంలోనే వస్తోన్న ఈ సినిమాని కూడా సంక్రాంతికి రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారని దిల్‌రాజు. సంక్రాంతికి అయితే ఇంటిళ్లిపాదికి మంచి ఎంటర్‌టైన్‌ ఇచ్చేచిత్రమవుతుందని, బాగా ఆడుతుందని దిల్‌రాజు భావిస్తున్నారు. మరి మూడు పెద్ద సినిమాలు పొంగల్‌కి పోటీ పడుతుండటంతో దిల్‌రాజు ఆ ధైర్యం చేస్తాడా? వెనక్కి తగ్గుతాడా? అన్నది సస్పెన్స్ గా మారింది. ఒకవేళ రిలీజ్‌ చేస్తే పెద్ద సినిమాల మధ్య ఇది నలిగిపోతుందా? ఎంటర్‌టైన్‌ చేస్తుందా? అన్నది సస్పెన్స్.
undefined
దీంతోపాటు డబ్బింగ్‌ చిత్రంతో దళపతి విజయ్‌ కూడా తెలుగు బాక్సాఫీసుపై దండయాత్రకి సిద్ధమవుతున్నారు. ఆయన తమిళంలో సంక్రాంతి సీజన్‌ని చూసుకుని `బీస్ట్` సినిమాని విడుదల చేయబోతున్నారు. విజయ్‌ తెలుగు మార్కెట్‌పై కన్నేసి చాలా రోజులవుతుంది. ఆయన ప్రతి సినిమా తెలుగులో డబ్‌ వర్షెన్‌తో అదే రోజు విడుదలవుతుంది. పైగా త్వరలో ఆయన డైరెక్ట్ తెలుగు సినిమా చేయబోతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో `బీస్ట్` సినిమాని కూడా తెలుగులో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారట మేకర్స్. మరి తెలుగులో పెద్ద హీరోల సినిమాల మధ్య నిలుస్తాడా? నలిగిపోతాడా? అన్నది ఆసక్తిగా మారింది.
undefined
అయితే పవన్‌ కళ్యాణ్‌-రానా చిత్రం, మహేష్‌ చిత్రం, అలాగే వెంకీ సినిమా తెలుగు మార్కెట్‌ పరిధిలోనే విడుదలవుతుంటాయి. ఇవి పాన్‌ ఇండియాలు కావు. కానీ ప్రభాస్‌ `రాధేశ్యామ్‌` మాత్రం పాన్‌ ఇండియా సినిమా. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ వెనక్కితగ్గే ఛాన్స్ లేదు. మహేష్‌ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గడు.పైగా గతంలోనే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. ఇప్పుడు కూడా అదే విషయాన్ని కన్ఫమ్‌ చేశాడు. ఈ రెండు సినిమాలు ఇలా ఉంటే పవర్‌ స్టార్‌ తగ్గుతాడా? మారే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆయన కలెక్షన్లని పట్టించుకోరు, పైగా డేట్‌ మారితే ఆయన ఇమేజ్‌కి దెబ్బే అది అభిమానులు జీర్ణించుకోలేరు. ఈ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే సంక్రాంతి బాక్సాఫీసు వద్ద రణరంగంగా మారబోతుందని అర్థమవుతుంది.
undefined
ఇంత వరకు బాగానే ఉన్నా, స్టార్లు, మేకర్స్ బాగానే ఉన్నా ఇప్పుడు ఆయా హీరోల అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. భారీ సినిమాల మధ్య పోటీ అంటే అభిమానుల మధ్య కూడా పోటీనే భావిస్తుంటారు. ప్రభాస్‌ అభిమానులకు, పవన్‌ ఫ్యాన్స్ కి ఎలాంటి విభేదాలు లేవు, ఇలా ఈ ముగ్గురు హీరోల అభిమానుల్లో ఎవరికీ తేడాలు లేవు. ఈ నేపథ్యంలో బాక్సాఫీసు పోటీని, థియేటర్ల వద్ద పోటీని ఎలా తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. మరోవైపు నిర్మాతల మధ్య కూడా పోటీ తప్పేలా లేదు. థియేటర్ల కోసం కొట్టుకునే పరిస్థితి నెలకొనే ఛాన్స్ ఉంది.మరి ఈ సమస్యని ఎలా పరిష్కరించుకుంటారనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.
undefined
click me!