కాజల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి దాదాపు 15ఏళ్ళు అవుతుంది. మొదట్లో సరైన హిట్ లేక ఇబ్బందులు పడ్డ కాజల్ కెరీర్ ని, మగధీర చిత్రం మార్చి వేసింది.
కాజల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి దాదాపు 15ఏళ్ళు అవుతుంది. మొదట్లో సరైన హిట్ లేక ఇబ్బందులు పడ్డ కాజల్, కెరీర్ ని మగధీర చిత్రం మార్చి వేసింది. అప్పటికి వరుస ప్లాప్స్ లో ఉన్న కాజల్ ని రాజమౌళి మగధీర లాంటి భారీ ప్రాజెక్ట్ కోసం ఎంచుకోవడం విశేషం.
అప్పట్లో చిరంజీవి సైతం కాజల్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారట. ఓ స్టార్ హీరోయిన్ ని తీసుకోవడం మంచిది అని రాజమౌళికి సూచించారట. తన సెలక్షన్ పై అపార నమ్మకం కలిగిన రాజమౌళి, కాజల్ ని మిత్ర వింద గెటప్ లో సిద్ధం చేసి చూపాక, ఓకె అన్నారట.
మగధీర ఇండస్ట్రీ హిట్ కొట్టగా, ఆ సినిమా ద్వారా కాజల్ ఫేమ్ భారీగా పెరిగిపోయింది. దానితో వరుస ఆఫర్స్ దక్కించుకొని టాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్ హోదా పట్టేసింది. 2009 జులై 31న విడుదలైన మగధీర నేటితో 12ఏళ్ళు పూర్తి చేసుకుంది.
అలా కాజల్ కెరీర్ కి మగధీర గట్టి పునాది వేసింది. గత ఏడాది అక్టోబర్ లో వివాహం చేసుకున్న కాజల్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనుభవిస్తున్నారు. భర్త గౌతమ్ కిచ్లు తో విందులు, విహారాలు, సరదాలతో చక్కని జీవితం గడిపేస్తున్నారు.
ఇల్లాలిగా మారినా చేతినిండా సినిమాలతో కాజల్ బిజీగా ఉంది. చిరు ఆచార్య, కమల్ భారతీయుడు 2 వంటి భారీ ప్రాజెక్ట్స్ తో పాటు తెలుగు, తమిళ హిందీ భాషలలో కలిపి అరడజనుకు పైగా చిత్రాల్లో నటిస్తున్నారు.
మరోవైపు సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో తన గ్లామర్ పవర్ చూపిస్తున్నారు. తాజాగా బ్లూ ట్రెండీ వేర్ లో సెక్సీ ఫోజులిచ్చారు కాజల్. ఆమె గ్లామర్ చూసి ఫిదా అయిన ఫ్యాన్స్, కామెంట్స్ రూపంలో అభిమానం చాటుకుంటున్నారు.
లేటెస్ట్ డిజైనర్ వేర్ లో కాజల్ చాలా స్లిమ్ అండ్ స్టైలిష్ గా ఉన్నారు. థర్టీ ప్లస్ లో కూడా సూపర్ హాట్ గ్లామర్ తో కాజల్ మెరిసిపోతున్నాడు. పున్నమి జాబిల్లి వలె తళుకులీనుతున్నారు.