ఎన్టీఆర్‌తో ఏఎన్నార్‌, సూపర్‌ స్టార్‌ కృష్ణ, జమునల విభేదాలు.. కారణాలివే?

Published : Jan 23, 2021, 02:23 PM IST

ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ తెలుగు చిత్ర పరిశ్రమకి రెండు కళ్లు లాంటి వారనేది హైదరాబాద్‌కి తెలుగు చిత్ర పరిశ్రమ వచ్చినప్పటి నుంచి ఉంది. ఆ తర్వాత కమర్షియల్‌ సినిమాలకు పునాది వేసిన హీరోగా కృష్ణకి పేరుంది. అయితే వీరి మధ్య పలు సందర్భాల్లో విభేదాలు తలెత్తాయి. ఎన్టీఆర్‌తో, ఏఎన్నార్‌కి, కృష్ణకి ఎక్కడ చెడింది? అసలేం జరిగిందనేది ఓ సారి చూస్తే..   

PREV
114
ఎన్టీఆర్‌తో ఏఎన్నార్‌, సూపర్‌ స్టార్‌ కృష్ణ, జమునల విభేదాలు.. కారణాలివే?
ఎన్టీఆర్‌ 25వ వర్థంతి ఇటీవల జరిగింది. జరుపుకున్నారు. ఏఎన్నార్‌ ఇటీవల ఏడవ వర్థంతిని జరిగింది. కృష్ణ సినిమాలు మానేసి రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే ఈ ముగ్గురి మధ్య విభేదాలు ఒకప్పుడు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా ఎన్టీఆర్‌తోనే మిగిలిన ఇద్దరికి మనస్పర్థాలు తలెత్తడం గమనార్హం.

214
టాలీవుడ్‌ హీరోలకు స్టార్‌ డమ్‌ని తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లకే దక్కుతుంది. అంతేకాదు ఈ ఇద్దరు అనేక చిత్రాల్లో కలిసి నటించారు. మల్టీస్టారర్‌ అనే ట్రెండ్‌ని క్రియేట్‌ చేశారు. వెండితెర అన్నదమ్ములుగా ఉన్నారు. కానీ వీరి మధ్య చాలా సార్లు విభేదాలు తలెత్తాయి. ఓ సందర్భంలో వీరిద్దరు మల్టీస్టారర్‌ సినిమాలు చేయకూడదని నిర్ణయానికి వచ్చారు.

314
ఎన్టీఆర్ సీఎం అయిన టైమ్‌లో ఏఎన్నార్‌తో అన్నపూర్ణ స్టూడియో విషయంలో గొడవ జరిగింది. ఈ స్టూడియో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని కట్టారనే విమర్శలు వచ్చాయి. తమ మధ్య ఉన్న విభేదాల కారణంగా సీఎం అయిన ఎన్టీఆర్‌ కూడా అన్నపూర్ణ స్టూడియో గోడలను బుల్డోజర్లతో కూలగొట్టించారు. అప్పట్లో ఇది సంచలనం సృష్టించింది.

414
ఆ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్నార్ తమ మధ్య విభేదాలను పక్కన పెట్టి కలిసిపోయారు. ఇద్దరు ఒక్కటయ్యారు. తర్వాత కలిసి సినిమాలు కూడా చేశారు.

514
ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకు అప్పట్లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన జమునతో విభేదాలు తలెత్తాయి. దీంతో ఇకపై జమునతో నటించకూడదని ఈ ఇద్దరు నిర్ణయించుకున్నారు. హీరోయిన్ల కొరత, పైగా స్టార్ల మధ్య విభేదాలు సరైనది కాదని భావించి దర్శక నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి కలిసి ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, జమునల మధ్య విభేదాలపై చర్చించి రాజీ కుదుర్చారు. ఆ తర్వాత వీరు ముగ్గురు కలిసి `గుండమ్మకథ` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.

614
ఎన్టీఆర్‌, కృష్ణ మధ్య విభేదాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. `అల్లూరి సీతారామరాజు` సినిమా విషయంలో ఎన్టీఆర్, కృష్ణ మధ్య జరిగిన గొడవలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు విడుదలైన కొన్ని రోజులకు ఈ సినిమా మళ్లీ రూపొందించాలనుకున్నారు.

714
కానీ అప్పటికే పరుచూరి బ్రదర్స్ సహా కొంత మంది కృష్ణ చేసిన అల్లూరి సీతారామరాజు సినిమాను చూడమని ఎన్టీఆర్‌కి చెప్పడంతో కృష్ణతో కలిసి `అల్లూరి సీతారామరాజు` సినిమాని చూశారు ఎన్టీఆర్‌. చూసి ఎంతో ఆనందించి కృష్ణని అభినందించారు.

814
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్టీఆర్‌కి వ్యతిరేకంగానూ పనిచేశారు. అంతేకాదు సీఎం అయిన ఎన్టీఆర్ పై `మండలాదీశుడు`, `గండిపేట రహస్యం`,` నా పిలుపే ప్రభంజనం` వంటి పలు సెటైరికల్ సినిమాలు చేసి తానేంటో నిరూపించుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకి మళ్లీ వీరిద్దరు కలిసిపోయారు.

914
కృష్ణ.. అప్పట్లో విజయ నిర్మలతో కలిసి ఏఎన్నార్ ఆల్ టైమ్ క్లాసిక్ `దేవదేసు` సినిమాను సినిమా స్కోప్‌లో రీమేక్ చేశారు. అదే టైమ్‌లో ఎన్టీఆర్‌ వర్గానికి చెందిన కొంత మంది పాత `దేవదాసు` రైట్స్ తీసుకొని ఒక వారం ముందుగా మళ్లీ రీ రిలీజ్ చేశారు. మ్యూజికల్‌గా మంచి పాటలున్న కృష్ణ, విజయ నిర్మలల `దేవదాసు`.. ఏఎన్నార్ `దేవదాసు` ముందు సత్తా చాటలేకపోయింది. ఓ రకంగా చెప్పాలంటే తేలిపోయింది.

1014
ఎన్ని గొడవలున్నా, ఇమేజ్‌ విషయంలో తేడాలున్నా, ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ తెలుగు తెర సూపర్‌స్టార్స్ గా వెలిగారు. కోట్లాది మంది ప్రేక్షకుల మన్ననలు పొందారు. సినిమాల పరంగా, నటులుగా అనేక సంచలనాలు క్రియేట్‌ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకి బలమైన పునాది వేశారు. నేటితరం హీరోలకు ఆదర్శంగా నిలిచారు.

1114
ఈ నెల 22న ఏఎన్నార్‌ 7వ వర్థంతి జరిగింది.

1214
శోభన్‌బాబు, ఎన్టీఆర్‌, కృష్ణ అరుదైన ఫోటో.

1314
ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ అరుదైన చిత్రం.
ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ అరుదైన చిత్రం.
1414
ఎన్టీఆర్‌, కృష్ణల అరుదైన ఫోటో.
ఎన్టీఆర్‌, కృష్ణల అరుదైన ఫోటో.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories