సావిత్రి హీరోయిన్ అయితే నేను పాటలు పాడను.. తెగేసి చెప్పిన స్టార్‌ సింగర్‌, ఇద్దరికి గొడవేంటి?

Published : Nov 30, 2024, 07:03 PM IST

మహానటి సావిత్రికి, స్టార్‌ సింగర్‌ ఎస్‌ జానకి చాలా రోజులు పెద్ద గొడవ నడిచింది. సావిత్రి హీరోయిన్‌ అయితే తాను పాటలు పాడనని చెప్పింది. మరి ఆ గొడవేంటి?  

PREV
15
సావిత్రి హీరోయిన్ అయితే నేను పాటలు పాడను.. తెగేసి చెప్పిన స్టార్‌ సింగర్‌, ఇద్దరికి గొడవేంటి?
Savitri

సావిత్రి అంటేనే మహానటి. ఆమె అద్భుతమైన నటనకు కొలమానం. అప్పట్లో హీరోయిన్లలో ఆమెనే టాప్‌. అత్యంత బిజీ హీరోయిన్‌గా రాణించారు. తెలుగు అయినా, తమిళం అయినా, కన్నడ, మలయాళం చిత్రాలైనా చాలా వరకు ఆమెనే కనిపించేది. అంతగా అద్భుతమైన నటనతో మెప్పించింది సావిత్రి. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

25
Savitri

ఎలాంటి కల్మషం లేని మనసు ఆమెది. చేయి చాచి అడిగిన వారికి కాదనకుండా ఇచ్చేసింది. తన ఆస్తుల్లో చాలా వరకు దానం చేసింది. ఏం లేని స్థితిలో, చిన్న షెడ్‌లో ఉన్న పరిస్థితుల్లోనూ ఆమె రిక్షావోడికి, ఐరన్‌ చేసే వ్యక్తికి కూడా నగలు అమ్మి దానం చేసిన గొప్ప మనసు ఆమెది. ఆమె ఎవరినీ చెడుగా మాట్లాడదు అని అంటుండేవారు. అందరితోనూ బాగుంటుందనే వారు.
 

35

అలాంటి సావిత్రికి ఓ సింగర్‌ విషయంలో గొడవ అయ్యిందట. స్టార్‌ సింగర్‌ని సావిత్రి అవమానించిందట. ఆ గాయని ఎవరో కాదు ఎస్‌ జానకి. అద్భుతమైన గాత్రంతో భారతీయ శ్రోతలను అలరిస్తున్న విషయం తెలిసిందే.

ఆమె మధురమైన గొంతుకు భాష తెలియని వారు కూడా అభిమానులే. అలాంటి సింగర్‌ జానకికీ, సావిత్రికి గొడవ అయ్యింది. సావిత్రి సినిమా అయితే తాను పాటలు పాడనే అనే స్థితికి వెళ్లిందట. మరి ఆ గొడవకు కారణమేంటి? అసలు ఏం జరిగిందనేది చూస్తే.. 
 

45

సావిత్రికి మొదట లీలా పాటలు పాడేవారట. ఆమె గొంతు బాగా సెట్‌ అయ్యేదట. ఆ తర్వాత పి సుశీల గొంతు బాగా సెట్‌ అయ్యింది. దీంతో సావిత్రి ఎక్కువగా సుశీలనే తనకు పాడాలని దర్శక నిర్మాతలకు చెప్పదట. అయితే ఓ సినిమా(పాడితాండ పిత్తిని)కి జానకితో పాడించారట.

ఆ పాటలు సావిత్రి విన్నది. కానీ ఆమెకి నచ్చలేదు. నాకు సుశీలనే పాడాలని పట్టుపట్టిందట. దీంతో ఆ పాటలన్నీ పక్కన పెట్టి సుశీలతోనే పాడించారట. అప్పుడు ఓకే చేసిందట. 
 

55

ఈ సంఘటనతో జానకి హర్ట్ అయ్యింది. ఇక అప్పట్నుంచి తాను మారాం చేసిందట. సావిత్రి హీరోయిన్‌ అయితే తాను పాటలు పాడనని చెప్పిందట. అలా చాలా సార్లు రిజెక్ట్ చేసిందట. ఓ సందర్భంలో `మురిపించే మువ్వలు`లో `సింగరవెలనే` పాటని రెండు నెలలు పెండింగ్‌లో పెట్టిందట. ఆ తర్వాత మేకర్స్ రిక్వెస్ట్ చేయడం, సావిత్రి కూడా తగ్గడంతో ఆ పాట పాడినట్టు చెప్పింది జానకి. ఎస్‌ జానకి దాదాపు 20 బాషల్లో 50వేల పాటలు పాడిమెప్పించారు. ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు. 
read more: సీఎం ఆఫీస్‌కి వచ్చి ముద్దు పెట్టిన అమ్మాయి.. నగలతో వచ్చి పెళ్లికి డిమాండ్‌, ఎన్టీఆర్‌ ఏం చేశాడో తెలుసా?

also read: పుష్ప 2` టికెట్‌ రేట్స్ హైక్‌ ఆరాచకం, ఓపెన్‌గా దోచుకోవడమే ?

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories