బిగ్ బాస్ తరువాత అభిజిత్ కు ఎన్నో ఆఫర్లు వచ్చాయి. కాని వాటిని పెద్దగా పట్టించుకోలేదు అభిజిత్. ఈ షో తరువాత ఒక వెబ్ సిరీస్ లో మాత్రమే నటించారు.. ఆరువాత ట్రెవెలర్ అవతారం ఎత్తి.. వరుసగా టూర్లు ప్లాన్ చేశాడు. దేశ విదేశాలు తిరుగుతూ.. తన కోరికను నెరవేర్చుకుంటున్నాడు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అభిజిత్ కు అరుదైన వ్యాధి ఉందంటూ ప్రచారం జరుగుతుంది.
ఆయన అందుకే సినిమాలు పెద్దగా పట్టించుకోకుండా తనకు ఇష్టమైన ట్రావెలింగ్ చేస్తూ గడిపేస్తున్నాడట. తాను అనుకున్న ప్రాంతాలు తిరుగుతున్నాడని తెలుస్తోంది. అంతే కాదు.. దానికి కావల్సిన టీమ్ తో పాటు.. ఎక్యూమ్మెంట్.. అన్నీ సెట్ చేసుకున్నాడు అభిజిత్. తన వీడియోలు అన్నీ.. ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా పేజ్ లో అప్ లోడ్ చేస్తున్నాడు అభిజిత్. అంతే కాదు అభిజిత్ లో కూడా చాలా మార్పు వచ్చింది.