తన గ్లామరు, నటన, స్టైలీష్ లుక్స్ లో బుల్లి తెరపై రచ్చ రచ్చ చేస్తుంది భానుశ్రీ. స్మాల్ స్క్రీన్ పై అల్లరి పిల్లగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దు గుమ్మ త్వరలో పెళ్ళి చేసుకోబోతుందట. అటు సినిమాలు.. ఇటు బుల్లి తెరపై షోస్ రెండింటితో బిజీ బిజీగా ఉంటూ.. వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్న ఈ అమ్మడు ప్రేమించిన వాడిని పెళ్ళి చేసుకోబోతుంది అంటు ఓ న్యూస్ వైరల్ గా మారింది.