హాలు ఖాళీ, ఫేక్ కలెక్షన్ వేస్తున్నారంటూ మండిపడ్డ నిర్మాత భార్య

First Published | Oct 15, 2024, 9:03 AM IST

కలెక్షన్ల విషయంలో ఎందుకు ఫేక్స్ వేస్తున్నారు. అలియా భట్ ధైర్యానికి మెచ్చుకోవాలి. పెయిడ్ మీడియా కూడా చూస్తూండటం ఆశ్చర్యంగా ఉంది.

Bhushan Kumar, Alia Bhatt, fake collections, Jigra


సినిమాకు కలెక్షన్స్ వేయటం పబ్లిసిటీలో ఓ భాగమే. ఫేక్ కలెక్షన్స్ వేసేది ఫ్యాన్స్ ఆనందం కోసం అని చెప్తూంటారు. అయితే కలెక్షన్స్ ఎక్కువ కనిపిస్తే సినిమా బాగా ఆడుతోంది అనుకుని మరో నలుగురు థియేటర్ కు వెళ్తారనేది నిర్మాతల ఆలోచన, ఆశ. అందుకు పెద్ద సినిమావాళ్లు సైతం అతీతం కాదు. అయితే అదే సమయంలో ఫేక్ కలెక్షన్స్ వేస్తున్నారంటూ ప్రచారం సోషల్ మీడియాలో మొదలవుతోంది. తాజాగా ఓ పెద్ద సినిమాల నిర్మాత భార్య  సైతం అలా అనటం అందరినీ షాక్ కి గురి చేసింది. ఆమె ఎవరు..ఏ సినిమా గురించి ఆమె ఆ మాట అంది.

Bhushan Kumar, Alia Bhatt, fake collections, Jigra


అలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో వాసన్ బాలా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘జిగ్రా’.ఈ సినిమా దసరా కనుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ లేడీ ఓరియంటెడ్ యాక్షన్ సినిమాకు డివైడ్ టాక్  వచ్చింది. అయితే.. సినిమాకు సంబంధించిన కలెక్షన్లపై యానిమల్ చిత్రం నిర్మాత భార్య ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఫేక్ కలెక్షన్లు ఎందుకు వేస్తున్నారని ఆమె మండిపడ్డారు. 


Bhushan Kumar, Alia Bhatt, fake collections, Jigra


‘నేను జిగ్రా చూసేందుకు హాలుకు వెళ్లా. అక్కడంతా ఖాళీగా ఉంది. అలానే మరికొన్ని ధియేటర్లకూ వెళ్లా. అక్కడా అదే పరిస్థితి. మరి, కలెక్షన్ల విషయంలో ఎందుకు ఫేక్స్ వేస్తున్నారు. అలియా భట్ ధైర్యానికి మెచ్చుకోవాలి. పెయిడ్ మీడియా కూడా చూస్తూండటం ఆశ్చర్యంగా ఉంది.

కలెక్షన్ల విషయంలో ప్రేక్షకులను వెర్రివాళ్లగా చూడొద్దు’అని అన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. మరోవైపు నిర్మాత కరణ్ జోహార్.. ‘మూర్ఖులకు మనమిచ్చే సమాధానం మౌనంగా ఉండటమేనని చేసిన పోస్ల్ ఆమెను ఉద్దేశించేనని అంటున్నారు. 


నిజానికి అలియా భట్ జిగ్రా మూవీ డిజాస్టర్‌గా నిలిచేలా కలెక్షన్స్ కనపడుతున్నాయి. అలియా భట్ జిగ్రా మూవీ మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. కానీ ఈ మూవీ నార్త్ ఆడియెన్స్‌కి కూడా ఎక్కలేదు. తెలుగులో భారీగానే ప్రమోషన్స్ చేశారు. కానీ తెలుగులో జిగ్రాని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.

అన్ని చోట్ల థియేటర్లు ఖాళీగానే దర్శనమిస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇదే విషయాన్ని టీ సీరిస్ అధినేత భూషణ్ కుమార్ భార్య, నటి దివ్యా ఖోస్లా చెప్పింది. తాను మాల్‌కి వెళ్లానని, జిగ్రా మూవీని చూస్తున్నానని, థియేటర్ మొత్తం ఖాళీగా ఉందంటూ చెప్పుకొచ్చింది. 
అలా జిగ్రా మీద దివ్యా ఖోస్లా వేసిన కౌంటర్‌కు కరణ్ జోహర్ పరోక్షంగా స్పందించాడు. మూర్ఖులకు మౌనమే సమాధానం అని పోస్ట్ వేశాడు. నిజం ఎప్పటికైనా బయటకు రావాల్సిందే.. అంటూ మళ్లీ కరణ్ పోస్ట్‌కు దివ్యా ఖోస్లా కౌంటర్ ఇచ్చింది. 


ఈ క్రమంలో  ధర్మ ప్రొడక్షన్స్, టీ సిరీస్ మధ్య ఉన్న చాలా కాలంగా ఉన్న  కోల్డ్ వార్ మరోసారి చర్చల్లోకి వచ్చింది. ధర్మ ప్రొడక్షన్స్‌లో అలియా ఉంటే.. రణ్‌వీర్ కపూర్ యానిమల్ చిత్రం టీ సిరీస్‌లో ఉంది. ఇప్పుడు రణ్ బీర్‌తో యానిమల్ పార్క్ కూడా షూట్ చేసేందుకు రెడీగా ఉన్నారు. 
 

'జిగ్రా'పై సమంత రివ్యూ... 
'ఆడ పులి అలియా భట్.. నీ పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంది. సినిమాను చూస్తున్నంతసేపు కళ్ళు తిప్పుకోలేక పోయాను. నువ్వు తీసుకునే బ్రేవ్ ఛాయిస్ లు, స్టాండర్డ్స్ నిన్ను మరింత స్ట్రాంగ్ గా చేస్తాయి. కీప్ ఇన్స్పైరింగ్' అంటూ అలియా భట్ ను, సినిమాలో ఆమె నటనను మెచ్చుకుంది సామ్. ఆ తర్వాత 'డైరెక్టర్ వాసన్ బాలా మీరు సినిమాను యూనిక్ గా తీశారు' అంటూనే సినిమాలో నటించిన మిగతా నటీనటులు, మ్యూజిక్ డైరెక్టర్ పై కూడా ప్రశంసల జల్లు కురిపించింది సమంత. ఇన్స్టాగ్రామ్ వేదికగా సమంత చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. 
 

Latest Videos

click me!