ఫోన్లు, వీడియో గేముల్లోనే ఉండటం వల్ల తక్కువగా మాట్లాడతామని, మన ఫీలింగ్స్ ని బయటకు షేర్ చేయడం తగ్గిపోతుందని, దీంతో చిరాకు, అసంతృప్తిలు పెరిగిపోతున్నాయని తెలిపింది. బహిరంగ కార్యకలాపాలు తగ్గిపోవడం వల్ల ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత లేకపోవడం, కోపం, నిరాశలు ఎదురవుతాయని చెప్పింది. తాను వీటికి దూరంగా ఉంటున్నట్టు, టెక్నాలజీకి బానిస కావద్దని తెలిపింది. తనకు ఎవరైనా ఫోన్లో గ్రీటింగ్ పంపిస్తే, అలా వద్దని ఏదైనా చదువుకోవడానికి మంచి పుస్తకాలు పంపండి అని చెబుతున్నట్టు తెలిపింది భూమిక. ఆమె పంచుకున్న ఈ సందేశం అభిమానులు ఎంతగానో ఆకట్టుకుంటుంది. వైరల్ అవుతుంది.