`వకీల్‌సాబ్`(Vakeel Saab) చిత్రంతో అదిరిపోయేలా రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. అదే ఊపులో నాలుగు సినిమాలు చేస్తున్నారు. అందులో ఇమ్మిడియెట్‌గా రిలీజ్ కాబోతుంది `భీమ్లా నాయక్`(Bheemla Nayak) సినిమా. ఇది మలయాళంలో హిట్ అయిన `అయ్యప్పనుమ్ కోషియుమ్` చిత్రానికి రీమేక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ మాటలు, కథనం అందిస్తున్నారు. ఈ సినిమాలో రానా(Rana) మరో హీరో. ఇద్దరు ఈగోయిస్టుల మధ్య జరిగే గొడవ ప్రధానంగా ఈ సినిమా సాగబోతుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ లు, పాటలు సినిమాలపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇందులో పవన్, రానా ఇద్దరూ పోటీ పోటీగా నటిస్తున్నట్టు ఆయా గ్లింప్స్ ని చూస్తుంటే అర్థమవుతుంది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కాబోతుంది. `ఆర్‌ఆర్‌ఆర్`(RRR Movie) కారణంగా Bheemla Nayak వాయిదా పడుతున్నట్టు వార్తలొచ్చినా అదేం లేదని సంక్రాంతికి రావడం మాత్రం పక్కా అనే విషయం తేల్చేశారు. కానీ ఇప్పుడు సమీకరణాలు మారిపోతున్నాయి. `భీమ్లానాయక్` ని సంక్రాంతి బరి తప్పుకుంటుందట. మరోసారి వాయిదా పడుతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాని సంక్రాంతి పోటీ నుంచి తప్పించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇందులో రాజకీయ ప్రమేయాలు కూడా ఉండటం చర్చనీయాంశంగా మారుతుంది.
RRR Movie` సినిమా కారణంగా, జగన్ వైఖరి కారణంగా ఈ సినిమా వాయిదా పడే అవకాశాలున్నాయంటున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్` సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7న విడుదల కాబోతుంది. ఇది దాదాపు నాలుగువందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన సినిమా. పదికిపైగా లాంగ్వేజెస్‌లో రిలీజ్ కాబోతుంది. భారీ బడ్జెట్ కావడంతో ఆ స్థాయి కలెక్షన్లు రావాలంటే భారీగానే రిలీజ్ ఉండాలి. పెద్ద సినిమాల పోటీ ఉండకూడదు.ఇప్పుడు మిగిలిన భాషల్లో ఈ సినిమాకి సమస్య లేకపోయినా తెలుగులోనే ప్రధానంగా `భీమ్లా నాయక్`, `రాధేశ్యామ్`(Radheshyam) చిత్రాలున్నాయి. మహేష్ బాబు నటించిన `సర్కారు వారి పాట చిత్రం కూడా సంక్రాంతి బరిలోనేఉన్నా.. `ఆర్ఆర్ఆర్` రిక్వెస్ట్ మేరకు ఇది ఏప్రిల్(april 1st)కి వెళ్లిపోయింది.
కానీ `భీమ్లా నాయక్`, `రాధేశ్యామ్` చిత్రాలు పోటీలో ఉన్నాయి. అయితే ఇందులో `రాధేశ్యామ్` చిత్రం కూడా వరల్డ్ వైడ్ రిలీజ్ ఉంది. ఇది కూడా భారీ బడ్జెట్ చిత్రం. దీంతో వాళ్లు కూడా ఈ పోటీ నుంచి, సంక్రాంతి
బరి నుంచి తప్పుకునేందుకు ఒప్పుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు `భీమ్లా నాయక్`పైనే పడింది. ఈ సినిమా వాయిదా వేసుకోవాలని `ఆర్‌ఆర్‌ఆర్` టీమ్, ఇండస్ట్రీ పెద్దలు తీవ్ర ప్రయత్నాలు
చేస్తున్నారట.
దీనికి టికెట్లు రేట్లు(Ticket Rates) కూడా మరో కారణమని తెలుస్తుంది. ఏపిలో టికెట్ రేట్లు తక్కువగా ఉన్నాయి. ఇదే విషయంలో `వకీల్‌సాబ్` సినిమా రిలీజ్ విషయంలో ఏపీ ప్రభుత్వానికి, చిత్ర యూనిట్‌కి మధ్య తీవ్రమైన చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ ఏపీలో అక్కడి జగన్(Cm Jagan) ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నేపథ్యంలో పొలిటికల్ పరిణామాల కారణంగా పవన్ సినిమాని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు `భీమ్లా నాయక్` విషయంలోనూ అదే జరగబోతుందని తెలుస్తుంది. `ఆర్‌ఆర్‌ఆర్`, `రాధేశ్యామ్` చిత్రాలు టికెట్ల రేట్లు పెంచుకోవాలని భావిస్తున్నాయి. తాము పెట్టిన బడ్జెట్ మించి కలెక్షన్లు రావాలంటే టికెట్లు రేట్లు ఎక్కువగా ఉండాల్సిందే. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వంతో మంతనాలు జరుగుతున్నాయి. అవసరమైతే కోర్ట్ కి కూడా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట `ఆర్‌ఆర్‌ఆర్` టీమ్.
సంక్రాంతి బరిలోనే పవన్ కళ్యాణ్ `భీమ్లా నాయక్` చిత్రం ఉండటంతో ఏపీ ప్రభుత్వం టికెట్లు రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వకపోవచ్చని తెలుస్తుంది. `రిపబ్లిక్` సినిమా ఈవెంట్‌లో ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యాడు పవన్. ఇండస్ట్రీ వైపు వస్తే మాడి మస్సైపోతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీ వాళ్లు దీనిపై ప్రతిఘటించాలని తెలిపారు. సినిమాల్లో వచ్చే ఆదాయన్ని ప్రభుత్వం తన ఖజానాలో వేసుకోవాలని భావిస్తుందని ఆరోపించారు. టికెట్ల రేట్లపై కూడా ఆయన విమర్శకులు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ మొండి వైఖరితో ఉండే అవకాశాలున్నాయని ఓ టాక్ నడుస్తుంది. పవన్ సినిమా ఉంటే టికెట్ల రేట్లు పెంచుకునేందుకు జగన్ అనుమతించరని అంటున్నారు.
ఇలాంటి పరిస్థితిలో ఏపీలో టికెట్లు రేట్లు పెంచడం కష్టం. అందుకు సీఎం జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరనే టాక్ వినిపిస్తుంది. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని బతిమాలుకుంటున్నారట ఇండస్ట్రీ పెద్దలు.
`భీమ్లా నాయక్` సినిమా వాయిదా పడితే `ఆర్‌ఆర్‌ఆర్`, `రాధేశ్యామ్` చిత్రాలు మాత్రమే సంక్రాంతి బరిలో ఉంటాయి. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా టికెట్ రేట్లని తాత్కాలికంగా పెంచుకునేందుకు అనుమతి వచ్చే
అవకాశాలున్నాయట. అందులో భాగంగానే `ఆర్‌ఆర్‌ఆర్` యూనిట్, `రాధేశ్యామ్` యూనిట్‌తోపాటు ఇండస్ట్రీ పెద్దలు కూడా `భీమ్లా నాయక్` నిర్మాతలతో, పవన్ కళ్యాణ్‌తో తీవ్రంగా చర్చిస్తున్నారని, ఆయన్ని
వెనక్కితగ్గేలా ప్రయత్నాలు చేస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్.
`రిపబ్లిక్` సినిమా ఫంక్షన్‌లో పవన్ మాట్లాడుతూ.. `అవసరమైతే నా సినిమాలను ఆపుకోండి.. కానీ ఇతర సినిమాలను ఇబ్బంది పెట్టొంద`ని కూడా వ్యాఖ్యానించ్చాడు. ఇప్పుడితే విషయాన్ని ఇండస్ట్రీ పెద్దలు హైలైట్ చేస్తూ పవన్ సినిమా కోసం తమ సినిమాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి నెలకొందని, అందుకే ఇండస్ట్రీ మేలు కోసం పవన్ వెనక్కి తగ్గాలని రిక్వెస్ట్ చేస్తున్నారట. మరి పవన్, `భీమ్లా నాయక్` టీమ్ వెనక్కి తగ్గుతుందా? మేం తగ్గేదెలే అంటూ ముందుకు సాగుతారా? అన్నది వేచి చూడాలి. కానీ ఇప్పుడీ డిస్కషన్ మాత్రం ఓ వైపు తెలుగు చిత్ర పరిశ్రమలో, మరోవైపు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారడం విశేషం.
also read: National Crush: రష్మిక మందన్నాకి నిధి అగర్వాల్ దిమ్మతిరిగే షాక్.. పవన్ కళ్యాణ్‌ని చూసుకునేనా ఈ దూకుడు?