Bheemla Nayak: 'భీమ్లా నాయక్' బ్యూటీ క్యూట్ లుక్స్.. ఫిదా అవుతున్న నెటిజన్లు, ఫోటోస్ వైరల్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 10, 2022, 09:25 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం భీమ్లా నాయక్. మలయాళీ బ్లాక్ బస్టర్ అయ్యప్పన్ కోషియం రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

PREV
17
Bheemla Nayak: 'భీమ్లా నాయక్' బ్యూటీ క్యూట్ లుక్స్.. ఫిదా అవుతున్న నెటిజన్లు, ఫోటోస్ వైరల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం భీమ్లా నాయక్. మలయాళీ బ్లాక్ బస్టర్ అయ్యప్పన్ కోషియం రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవల విడుదలైన సాంగ్స్, టీజర్స్ తో భీమ్లా నాయక్ మానియా ఒక రేంజ్ లో సాగుతోంది. 

27

Pawan Kalyan పోలీస్ అధికారిగా మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇక రానా దగ్గుబాటి డానియల్ శేఖర్ గా కనిపించబోతున్నాడు. రానా, పవన్ కళ్యాణ్ మధ్య ఇగో వార్ ని దర్శకుడు సాగర్ చంద్ర అభిమానులు ఎంజాయ్ చేసే విధంగా చూపించబోతున్నాడు. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ నటిస్తోంది. రానాకి జోడిగా ముందుగా ఐశ్వర్య రాజేష్ ని అనుకున్నారు. కానీ డేట్లు అడ్జెస్ట్ కాకపోవడంతో ఐశ్వర్య రాజేష్ ఈ చిత్రం నుంచి తప్పుకుంది. 

37

దీనితో సౌత్ మొత్తం జల్లెడ పట్టిన భీమ్లా నాయక్ టీం చివరకు మలయాళీ ముద్దుగుమ్మ Samyuktha Menon ని రానా హీరోయిన్ గా ఫైనల్ చేశారు. ప్రస్తుతం సంయుక్త షూటింగ్ లో కూడా పాల్గొంటోంది. సంయుక్త మీనన్ కు తెలుగులో ఇదే తొలి చిత్రం. సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో హాట్ బ్యూటీ గా గుర్తింపు సొంతం చేసుకుంది. ఇప్పటికే కొన్ని మలయాళీ చిత్రాలతో సంయుక్త పాపులర్ అయింది. 

47

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సంయుక్త మీనన్ తన గ్లామర్ ఫోజులతో కుర్రకారుని ఆకర్షిస్తోంది. ట్రెడిషనల్ గా కనిపించినా, బికినిలో అందాలు ఆరబోసినా ఆమె సౌందర్యానికి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. 

57

తాజాగా సంయుక్త మీనన్ ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోస్ షేర్ చేసింది. క్యాజువల్ గా తన ఇంట్లో కూల్ గా గడుపుతున్న పిక్స్ ని సంయుక్త షేర్ చేసింది. ఈ పిక్స్ లో సంయుక్త భలే క్యూట్ గా మెస్మరైజ్ చేస్తోంది. 

67

ఇదిలా ఉండగా భీమ్లా నాయక్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 12న విడుదల కావలసిన ఈ చిత్రం ఫిబ్రవరి 25కి వాయిదా పడింది. దీనితో పవన్ అభిమానులకు నిరాశ తప్పలేదు.రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో భీమ్లా నాయక్ హంగామా మళ్ళీ మొదలైంది. 

77

రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ పవన్ ఫ్యాన్స్ భీమ్లా నాయక్ ట్రాన్స్ లోకి వెళ్లిపోతున్నారు. పవన్, రానా తొలిసారి కలసి నటిస్తుండడం.. నిత్యామీనన్, సంయుక్త మీనన్ లాంటి అందాల భామలతో భీమ్లా నాయక్ చిత్రం అభిమానులకు మంచి ట్రీట్ ఇవ్వనుంది. 

Read more Photos on
click me!

Recommended Stories