మూడు భాషల్లో.. ఆ మూడు సినిమాల రచ్చ, బాక్సా ఫీస్ ను షేక్ చేస్తూ..మోత మోగించేస్తున్నాయి.

Published : Mar 01, 2022, 09:33 AM ISTUpdated : Mar 01, 2022, 09:44 AM IST

మూడు సినిమాలు.. మూడు భాషలు.. రచ్చ రచ్చ చేస్తున్నాయి. సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్నాయి. ఫ్యాన్స్ ను ఊర్రూతలూగిస్తున్నాయి. భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్నయి.  

PREV
110
మూడు భాషల్లో.. ఆ మూడు సినిమాల రచ్చ, బాక్సా ఫీస్ ను షేక్ చేస్తూ..మోత మోగించేస్తున్నాయి.

టాలీవుడ్ ను భీమ్లా నాయక్(Bheemla Nayak) ఒక ఊపు ఊపుతుంటే.. కోలీవుడ్ లో వాలిమై కలెక్షన్ల రచ్చ చేస్తోంది. అటు బాలీవుడ్ లో ఆలియా భట్ గంగూబాయ్ సునామీ సృస్టిస్తోంది. ఒకేసారి రిలీజ్ అయిన ఈ మూడు సినిమాలు.. మూడు భాషల్లో సత్తా చాటుకుంటున్నాయి.

210

ముందుగా భీమ్లా నాయక్ (Bheemla Nayak) సంగతి చూసుకుంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వకీల్ సాబ్ తరువాత మళ్లీ అంతకంటే ఎక్కువ సక్సెస్ దొరికిందని చెప్పుకోవచ్చు. మలయాళ మూవీ రీమేక్ గా తెరెక్కిన భీమ్లా నాయక్ కు సాగర్ చంద్ర డైరెక్ట్ చేయగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు రాసి స్క్రీన్ ప్లే అందించారు.

310

భీమ్లా నాయక్(Bheemla Nayak)  దెబ్బకు బాక్సా ఫీస్ దద్దరిల్లి పోతుంది. మొదటి మూడు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ ను రాబట్టింది భీమ్లా నాయక్.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 52 కోట్ల 96 లక్షల షేర్ ను సాధించింది. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 25 కోట్ల 85 లక్షలను వసూలు చేసింది. యూఎస్ లో 2 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 69 కోట్ల 5 లక్షల షేర్ ను రాబట్టింది.ఇప్పటీకీ ఇదే దూకుడు కొనసాగిస్తుంది భీమ్లా నాయక్.

410

భీమ్ల నాయక్ సినిమాకు రిలీజ్  ప్రబ్లమ్స్ ఎదురయ్యాయి.. ఏపీలో టికెట్ ఇష్యూ నడుస్తుంది. అయినా సరే.. ధైర్యంగా రిలీజ్ చేశారు టీమ్. ఎన్ని సమస్యలు ఎదురైనా అధిగమించి రిలీజ్ చేసినందుకు మంచి సక్సెస్ అందించారు ఆడియన్స్. భీమ్లాగా పవన్, డానియల్ గా రానా పర్ఫామెన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.ఫిబ్రవరి 25న రిలీజ్ అయిన ఈ సినిమకు బ్రహ్మరధం పట్టారు.. కలెక్షన్ల వర్షం కురిపించారు ఆడియన్స్.

510

ఇక ఇదే రోజు.. అంటే ఫిబ్రవరి 25న బాలీవుడ్ లో రిలీజ్ అయ్యింది గంగూబాయ్ కతియావాడి. ఆలియా భట్ తన కెరీర్ లో చేసిన ఫస్ట్ ఎక్స్ పెర్మెంట్ మూవీ ఇది. ఏమౌతుందా అని అందరూ ఉత్కంఠతో ఎదురు చూశారు. కాని ఆలియా పడ్డ కష్టం వృధా పోలేదు. బాలీవుడ్ లో ఓ కొత్త ట్రెండ్ మార్క్ ను సృస్టించిందీ మూవీ. ఒక లేడీ డాన్ పాత్రలో.. చాలా చిన్న వయస్సులో నటించి మెప్పించింది ఆలియా భట్. గొంతులో కాస్త గాంభీర్యం మిస్ అయినా.. తన పెర్ఫామెన్స్ తో మెస్మరైజ్ చేసింది

610

ఆలియా(Alia Bhatt). బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సంజయ్ లీలా బన్సాలి స్వీయ దర్శకత్వంలో పెన్ స్టూడియోస్ తో కలిసి  నిర్మించిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. గంగూబాయ్ సినిమాపై చుట్టుకున్న వివాదాలు బాగా  హైప్‌ తీసుకొచ్చాయి. అయితే ఈ సినిమాలో తన తల్లి గంగూబాయ్‌ కథియావాడీని వేశ్యగా చూపించారంటూ ఆమె తనయుడు బాబూ రావుజీ షా కోర్టుకు వెళ్లారు. సినిమా రిలీజ్ కూడా ఆపేయాలని ప్రయత్నించినా.. సినిమా విడుదలపై స్టే విధించేందుకు కోర్డ్ నిరాకరించింది. 

710

ఫిబ్రవరి 25 న రిలీజ్ అయిన గంగూబాయి కతియావాడి ఫస్ట్ డే  బాక్సాఫీస్ దగ్గర 10 కోట్ల వరకూ రాబట్టింది. రెండో రోజు   13.32 కోట్లు వసూలు చేసింది. మూడవ రోజు 15.30 కోట్లు వసూలు చేసింది, మొత్తంగా దేశీయ వారాంతపు వసూళ్లు 39.12 కోట్లకు చేరుకుంది. ఇండియాలో 46.57 కోట్లు, ఓవర్సీస్‌లో 10.51 కోట్లు వసూలు చేసింది గంగూబాయ్ కతియావాడి సినిమా. ప్రపంచవ్యాప్తంగా 57.08 కోట్ల గ్రాస్ కలెక్షన్‌ను సాధించింది

810
valimai 100 crores

ఇక ఈసినిమాలకంటే ముందే అంటే ఫిబ్రవరి 24న రిలీజ్ అయ్యింది అజిత్(Ajith) వాలిమై. తమిళనాట అజిత్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్ ఆడియన్స్ ఆయన్ను ఎంత ఇష్టపడతారో అటు  ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అంతకంటే ఎక్కువే అజిత్ ను ప్రేమిస్తారు. ఇక  ఆయన వాలిమై సినిమాతో అటు మాస్ ను ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఊర్రూతలూగించారు.

 

910

వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్  బోనీ కపూర్ నిర్మించారు. తమిళనాట తొలి రోజునే ఈ సినిమా 36 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. వీకెండ్ లో ఈ సినిమా జోరు గట్టిగానే కొనసాగింది. ఒక్క తమిళనాడులోనే ఈ సినిమా 100 కోట్లకిపైగా వసూళ్లను సాధించిందని అంచనా. తమిళనాట మరికొన్ని రోజులు వాలిమై హవా ఇలానే కొనసాగుతుందని అంచనా.

1010

అజిత్ కు బైక్ రేసులంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో రేసులతో దడదడలాడించాడు స్టార్ హీరో. అంతే కాదు టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో కార్తికేయ వాలిమైలో అజిత్ కు ఆపోజిట్ క్యారెక్టర్ లో మెరిశాడు. ఈసినిమాతో కార్తికయాకు కూడ మంచి ఇమేజ్ వచ్చింది. దీనితో పాటు అవకాశాలు కూడా వరస కట్టినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈమూడు సినిమాలు.. మూడు భాషల్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. బాక్సా ఫీస్ ను షేక్ చేస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories