ఏమైంది ఎసిపి సర్ ఎందుకు అలా ఉన్నారు మీకు ఏమైనా ఇష్టం లేని పని చేస్తున్నారా అంటూ నిలదీస్తుంది. అలాంటిదేమీ లేదు అంటాడు మురారి. అయినా అవన్నీ నీకెందుకు నిన్నేమైనా డ్రాప్ చేయాలా నువ్వు ఏమైనా చిన్న పిల్లవా, పెద్దత్తయ్య తనకి పని అప్పచెప్పారు మురారి బిజీగా ఉన్నాడు అంటుంది ముకుంద. పెద్ద అత్తయ్య చెప్తే కచ్చితంగా చేసి తీరాలి కానీ ఈ మధ్యలో నువ్వు ఎందుకు పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకున్నట్లుగా అంటుంది కృష్ణ.