చిరంజీవితో రొమాన్స్ ఎంజాయ్‌ చేయలేకపోయా.. ఆ మూమెంట్స్ గుర్తు చేసుకుంటూ నటి భానుప్రియ షాకింగ్‌ కామెంట్స్

First Published | Apr 5, 2024, 6:16 PM IST

చిరంజీవి సీనియర్‌ హీరోల్లో బెస్ట్ డాన్సర్‌. ఆయన తరంలో తనతో పోటీ పడే నటి భానుప్రియ. అయితే చిరుతో డాన్స్ చేసేటప్పుడు ఆమె రొమాన్స్ ని ఎంజాయ్‌ చేయలేకపోయిందట. 
 

అలనాటి స్టార్‌ హీరోయిన్‌ భాను ప్రియ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్నారు. చాలా అరుదుగా ఆమె సినిమాల్లో కనిపిస్తున్నారు. చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ఆమె ఇప్పుడు వైరల్‌గా మారుతున్నారు. వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. హాట్‌ టాపిక్‌ అవుతున్నారు భానుప్రియ. 
 

భానుప్రియ ఇంటర్వ్యూలో ఒకటి యూట్యూబ్‌లో, సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఆమె అనేక ఇంట్రెస్టింగ్‌ విషయాలను పంచుకుంది. ఇప్పటి వరకు బయటకు రాని విషయాలను ఓపెన్‌ అయ్యింది. తాను నటించిన హీరోల గురించి, సినిమాల గురించి చెప్పుకొచ్చింది. ఈక్రమంలో ఆమె చేసే కామెంట్స్ మరింత ఆసక్తిని రేకెత్తించేలా ఉండటం విశేషం.  
 


భానుప్రియ.. చిరంజీవితో కలిసి చాలా సినిమాలు చేశారు. పదికిపైగానే ఉంటాయి. అందులో చాలా వరకు హిట్లు, బ్లాక్‌ బస్టర్స్ ఉన్నాయి. అయితే చిరంజీవికి డాన్స్ పరంగా నచ్చిన హీరోయిన్లలో రాధ, రాధికతోపాటు భానుప్రియ పేరు కూడా చెప్పేవారు. అయితే రాధ, రాధికలు చిరంజీవితో డాన్స్ చేసేటప్పుడు ఆ మూమెంట్స్ ని బాగా ఎంజాయ్‌ చేసేవాళ్లట. కానీ భానుప్రియ అలా చేసేది కాదట. 
 

తాను చిరంజీవిని కాంపిటీటర్‌గా భావించేదట. చిరంజీవితో తాను డాన్స్ చేసేటప్పుడు బాగా చేయాలనే తపనతో, కాంపిటీషన్‌ మైండ్‌తోనే డాన్సులు చేసేదాన్ని అని తెలిపింది భానుప్రియ. చిరంజీవి డాన్స్ మూమెంట్స్, కళ్లు కదిపే విధానంతో సహా అన్నీ గమనిస్తూ ఉండేదట. అయితే ఈ క్రమంలో పాటల్లో ఆ రొమాన్స్ ని ఎంజాయ్ చేసేదాన్ని కాదని, రొమాన్స్ చేయలేకపోయేదాన్ని అని చెప్పింది భానుప్రియ. 
 

తన దృష్టి మొత్తం డాన్స్ బాగా చేయాలనే దానిపైనే ఉండేదని చెప్పింది. తాను డాన్స్ నేర్చుకునేటప్పుడు తమ మాస్టర్‌ డాన్స్ మూమెంట్స్ ఏమాత్రం తేడా వచ్చినా మాస్టర్‌ కర్ర విసిరేసేవాడని, అదే తన మైండ్‌లో ఉండదని, ఆ జాగ్రత్తతో చేసేదాన్ని అని, దాని కారణంగానే రొమాన్స్ మీద ఫోకస్‌ పెట్టలేకపోయానని, ఆ బాధ, ఆ వెలితి ఉంటుందని చెప్పింది. చిరంజీవి కూడా ఈ విషయాన్ని చెప్పేవారని తెలిపింది భానుప్రియ. 
 

చిరంజీవి గ్రేట్‌ డాన్సర్‌ అని, ఆయన్ని బీట్‌ చేయడం సాధ్యం కాదని, కానీ ఆయనతో పోటీపడాలని మాత్రం ఉంటుందని, ఆయనతో డాన్స్‌ చేస్తుంటే చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుందని, కొన్నిసార్లు ఓవర్ గా చేస్తానేమో అనిపిస్తుంటుందని చెప్పింది. చిరంజీవితో యాక్ట్ చేయడంగానీ, డాన్స్ చేయడం గానీ వండర్‌ఫుల్‌ మూమెంట్స్ అని చెప్పింది భానుప్రియ. ఐ డ్రీమ్‌కి గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలు షేర్‌ చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఇంటర్వ్యూ వైరల్ అవుతుంది. 

భానుప్రియ, చిరంజీవి కాంబినేషన్‌లో `స్టేట్‌ రౌడీ`, `దొంగమొగుడు`, `ఖైదీ నెం 786`, `జ్వాల`, `విజేత`, `జేబు దొంగ`, `త్రినేత్రుడు`, `చక్రవర్తి, `చిరంజీవి` వంటి సినిమాలు వచ్చాయి. కొన్నింటిలో పెయిర్‌గా, మరికొన్నింటిలో సాంగుల్లో మెరిసి రచ్చ చేసిందీ జంట. 
 

Latest Videos

click me!