భానుమతితో నటించాలంటే భయం
హీరోయిన్ గా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, దర్శకురాలిగా భానుమతి స్థాయి, సామర్థ్యం, ఆత్మవిశ్వాసం వేరు. స్టార్ హీరోల ముందు కూడా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడేవారు భానుమతి. ఎన్టీఆర్ ఏఎన్నార్ ల కంటే ముందు ఇండస్ట్రీకి వచ్చారు ఆవిడ. అంతే కాదు ఈ ఇద్దరు హీరోలకంటే వయసులో కూడా పెద్దవారు కావడంతో అందరు ఆమెను గౌరవించేవారు.
తెలుగు చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు భానుమతి. వయస్సులోను, నటన పరంగా కూడా భానుమతి ఏఎన్ఆర్ కంటే ముందుగానే పరిశ్రమలో స్థిరపడ్డారు. ఆమె ధైర్యసాహసాలు, స్పష్టత, పట్టుదల సినీ పరిశ్రమలో అందరికీ తెలిసిన విషయమే. అంతటి స్థాయిలో ఉన్న భానుమతితో నటించాలంటే అప్పటి నటులకు కూడా భయం కలిగేదట.