Kannappa Collections: రెండో రోజు పెరిగిన `కన్నప్ప` కలెక్షన్లు.. మొత్తంగా ఎంత వచ్చాయి? ఇంకా ఎంత రావాలి?

Published : Jun 29, 2025, 04:31 PM IST

మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా రూపొందించిన `కన్నప్ప` మూవీ శుక్రవారం విడుదలై ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ మూవీ రెండు రోజుల కలెక్షన్ల రిపోర్ట్ బయటకు వచ్చింది. 

PREV
15
`కన్నప్ప`తో చాలా ఏళ్ల తర్వాత మంచు విష్ణుకి విజయం

మంచు విష్ణు ఎట్టకేలకు హిట్‌ కొట్టాడు. కొన్ని ఏళ్ల తర్వాత ఆయనకు హిట్‌ పడింది. శుక్రవారం విడుదలైన `కన్నప్ప` చిత్రానికి పాజిటివ్‌ టాక్‌ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో మంచు విష్ణు ఖుషీ అయ్యారు. ఇన్నాళ్లకి హిట్‌ రావడంతో ఆయన ఎమోషనల్‌ అయ్యారు. 

ఈ సక్సెస్‌ని నమ్మలేకపోతున్నారు. అదే సమయంలో తనకు హిట్‌ కొట్టడం తప్ప మరో ఆప్షన్‌ లేదని ఓపెన్‌ అయ్యారు. సినిమా కోసం తన ఆస్తులన్నింటిని తాకట్టు పెట్టినట్టు తెలిపారు మంచువిష్ణు.

25
`కన్నప్ప` కలెక్షన్లకు హెల్ప్ అవుతున్న భారీ కాస్టింగ్‌

కన్నప్ప చరిత్ర నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో ప్రభాస్‌, మోహన్‌ లాల్‌, అక్షయ్‌ కుమార్‌, కాజల్‌, మోహన్‌ బాబు వంటి భారీ కాస్టింగ్‌ నటించడంతో సినిమా రేంజ్‌ మారిపోయింది. పాన్‌ ఇండియా వైడ్‌గా ఇది సత్తాని చాటుతుంది.

 మంచి వసూళ్లని రాబడుతుంది. ఈ మూవీ మొదటి రోజు రూ.20కోట్లు వసూళు చేసినట్టు టీమ్‌ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రెండో రోజు కలెక్షన్ల వివరాలు బయటకు వచ్చాయి.

35
`కన్నప్ప` రెండు రోజుల కలెక్షన్లు

`కన్నప్ప` మూవీ రెండో రోజు కలెక్షన్లు పెరిగాయి. రెండో రోజు రూ.22.5కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఈ మూవీకి మొత్తంగా రెండు రోజుల్లో రూ.42.5కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

 అంటే సుమారు రూ.22కోట్ల షేర్‌ వసూలు చేసింది. ఈ మూవీని దాదాపు వంద కోట్లతో రూపొందినట్టు సమాచారం. అంటే సినిమా రెండు వందల కోట్ల గ్రాస్‌ వసూలు చేస్తే నిర్మాతలు సేఫ్‌ అవుతారు. 

ఆదివారం కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన ఇది మూడు రోజుల్లో అరవై కోట్ల నుంచి డెబ్బై కోట్ల వరకు రాబట్టే ఛాన్స్ ఉంది. ఈ మూవీకి లాంగ్‌ రన్‌ ఉంటుంది. అది కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు.

45
`కన్నప్ప` ఓటీటీ రైట్స్ భారీ రేటు

అయితే `కన్నప్ప` సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి బిజినెస్‌ జరగలేదు. అంతా సొంతంగానే రిలీజ్‌ చేశారు. ఓటీటీ బిజినెస్‌ కూడా కాలేదు. సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వస్తోన్న నేపథ్యంలో ఓటీటీ రైట్స్ భారీగానే పలికే ఛాన్స్ ఉంది. 

పైగా ధైవత్వంతో కూడిన మూవీ కావడం, శివతత్వాన్ని తెలియజేసే మూవీ కావడంతో ఓటీటీలోనూ దీనికి మంచి ఆదరణ దక్కుతుంది. కాబట్టి ఓటీటీ రేట్‌ భారీగానే వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆడియో, శాటిలైట్‌ రూపంలో కూడా మంచి రేట్స్ వస్తాయని టీమ్‌ ఆశిస్తుంది. 

ఇవన్నీ సినిమాకి బోనస్‌గా నిలవబోతున్నాయి. మొత్తానికి చాలా ఏళ్ల తర్వాత మంచు విష్ణు పెద్ద హిట్‌ కొట్టాడని చెప్పొచ్చు. ఈ మూవీ టాక్‌ని చూసి నిర్మాతలు విష్ణుకు అడ్వాన్స్ లు ఇస్తున్నారట. ఇది సంతోషంగా ఉందన్నారు విష్ణు.

55
కన్నప్ప చరిత్ర ఆధారంగా రూపొందిన `కన్నప్ప` మూవీ

మంచు విష్ణు కన్నప్పగా నటించిన `కన్నప్ప` చిత్రాన్ని మోహన్‌ బాబు నిర్మించారు. శ్రీకాళహస్తిలో జన్మించిన తిన్నడు దేవుడిని నమ్మడు. అలాంటి వ్యక్తి శివభక్తుడు ఎలా అయ్యాడు? 

అసలు కన్నప్ప ఎవరు? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. హిందీలో మహాభారతంని రూపొందించిన దర్శకుడు ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ ఈ మూవీకి దర్శకత్వం వహించడం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories