తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్, భానుమతి ఇద్దరూ అమోఘమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇద్దరికి ఇద్దరు ఎవరు వీరికి సాటి రారు అన్న విధంగా తమ కెరీర్ ను మలుచుకున్నారు. పట్టుదల విషయంలో ఇద్దరికి పెద్ద తేడా లేదు. పద్దతులు, సమయపాలన, ఆహారం, ఏది తీసుకున్నా ఎన్టీఆర్ భానుమతి స్ట్రిక్ట్ గానే ఉంటారు.
కాకపోతే వారి వారిఅభిరుచులు తేడా కాని, చేసే పనిలో నిబద్ధత మాత్రం ఒక్కటే. ఉదాహరణకు తీసుకుంటే ఎన్టీఆర్ నాన్ వేజ్ లేనిదే ముద్దు ముట్టరు, కాని భానుమతి మాత్రం పక్కా మడి ఆచారంతో వండిన వెజిటేరియన్ ఫుడ్ తింటారు. ఇక భానుమతి పక్కాగా 12 అవ్వగానే ఎంత పెద్ద సినిమా షూటింగ్ లో ఉన్నా సరే భోజనానికి వెళ్లాల్సిందే.
కాని ఎన్టీఆర్ ఒంటిగంట కొట్టిన తరువాతే భోజనానికి లేస్తారు. వీరి టైమింగ్ లో మార్పు ఉండాదు. తినే తిండి విషయంలో మార్పు ఉండదు. కాని వారు అనుకున్నది అనుకున్నట్టు పద్దతిగా చేసుకుంటూ వెళ్తారు అంతే. ఎవరికోసమో వారి పద్దతులు మార్చుకోరు. ఇలా ఇద్దరు స్టార్లుగా వెలుగు వెలిగారు.