Bhagyashri: ఒక్క హిట్ తో మొత్తం మారిపోయింది, భాగ్యశ్రీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. టాప్ హీరోయిన్లకు చెక్

Published : Jul 24, 2026, 07:53 PM IST

లెనిన్ చిత్రం విజయం సాధించడంతో భాగ్యశ్రీ బోర్సే గురించి ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఆమె రెమ్యునరేషన్ భారీ స్థాయిలో పెరిగింది అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

PREV
15
Bhagyashri Borse

టాలీవుడ్ లో భాగ్యశ్రీ బోర్సే సంచలన హీరోయిన్ గా మారిపోయింది. మిస్టర్ బచ్చన్ చిత్రంతో భాగ్యశ్రీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె గ్లామర్ కి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. కానీ వరుస ఫ్లాపులు వెంటాడాయి. మిస్టర్ బచ్చన్ చిత్రం డిజాస్టర్ కాగా ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా ఆమెకి స్టార్ డమ్ తీసుకురాలేదు.

25
భాగ్యశ్రీ సినిమాలు

మిస్టర్ బచ్చన్ తర్వాత భాగ్యశ్రీ కింగ్డమ్, కాంత, ఆంధ్ర కింగ్ తాలూకా లాంటి చిత్రాల్లో నటించింది. ఈ చిత్రాలు కొన్ని పర్వాలేదనిపించాయి కానీ కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. దీనితో భాగ్యశ్రీని ఐరెన్ లెగ్ అంటూ కామెంట్స్ చేయడం ప్రారంభించారు. కానీ లెనిన్ మూవీతో భాగ్యశ్రీ తొలి సూపర్ హిట్ అందుకుంది.

35
భారీగా పెరిగిన భాగ్యశ్రీ రెమ్యునరేషన్

దీనితో మరోసారి భాగ్యశ్రీ టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇప్పుడు ఆమె రెమ్యునరేషన్ కూడా సంచలనమే. తొలి చిత్రానికి భాగ్యశ్రీ కేవలం 30 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్ గా అందుకుంది. లెనిన్ తర్వాత భాగ్యశ్రీ చేయబోయే చిత్రానికి ఆమెకి ఏకంగా రూ 2 కోట్లు ఆఫర్ చేసినట్లు టాక్. రెమ్యునరేషన్ లో ఇది మామూలు జంప్ కాదు.

45
టాప్ హీరోయిన్లకు చెక్ పెట్టేస్తున్న భాగ్యశ్రీ

ఇంకొక్క హిట్ పడితే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లుగా ఉన్న శ్రీలీల, రష్మిక లాంటి వాళ్ళని భాగ్యశ్రీ అధికమించడం ఖాయం అని అంటున్నారు. ఐరెన్ లెగ్ అనే విమర్శలు తనకు మాత్రమే రాలేదని.. గతంలో శ్రుతి హాసన్, శ్రీలీల, తాప్సి లాంటి హీరోయిన్లకు కూడా ఇలాంటి విమర్శలు తప్పలేదని భాగ్యశ్రీ తెలిపింది.

55
విమర్శలకు కుంగిపోను

కానీ విమర్శలకు వాళ్ళు కుంగిపోకుండా తమని తాము నిరూపించుకుని ఎదిగారని భాగ్యశ్రీ తెలిపారు. అయితే సినిమా ఫ్లాప్ అయినప్పుడు హీరోయిన్ ని మాత్రమే నిందించడం కరెక్ట్ కాదు. సినిమా అనేది టీం ఎఫర్ట్. క్రియేటివ్ వర్క్, ఎడిటింగ్ లాంటి అంశాలలో హీరోయిన్ పాత్ర ఏమీ ఉండదు. తన పాత్రను తాను ప్రతి చిత్రంలోనూ 100 శాతం న్యాయం చేస్తున్నాను అని భాగ్యశ్రీ పేర్కొంది.

Read more Photos on
click me!

Recommended Stories