Celina Jaitly: మ్యారేజ్‌ లైఫ్ లో నరకం.. పిల్లలు, విడాకులు, హక్కులపై శౌర్యం నటి బోల్డ్ కామెంట్స్

Published : Jul 14, 2026, 10:51 AM IST

Celina Jaitly: ఆస్ట్రియా వ్యాపారవేత్తను పెళ్లాడి, ముగ్గురు పిల్లలకు తల్లైంది. కానీ ఆ బంధం నరకంగా మారింది. విడాకుల తర్వాత తన అనుభవాన్ని పంచుకుంటూ, మహిళలకు ఓ ముఖ్యమైన సలహా ఇచ్చింది నటి సెలినా జైట్లీ. ఆస్తి నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలో వివరించింది.

PREV
17
రంగుల ప్రపంచం వెనుకున్న అసలు నిజాలు బయటపెట్టిన శౌర్యం నటి

బాలీవుడ్ గ్లామర్ బ్యూటీగా రాణిస్తోన్న హీరోయిన్‌ సెలినా జైట్లీ తెలుగులో `శౌర్యం` చిత్రంలో మెరిసింది. ఇందులో పాటలో ఆడిపాడిన ఆమె బాలీవుడ్‌లో ఎక్కువగా సినిమాలు చేసింది. అయితే తాజాగా ఆమె  జీవితంలో రంగుల ప్రపంచమే కాదు, కన్నీటి సంద్రం కూడా ఉంది. బయటకు అందంగా కనిపించే సెలబ్రిటీల జీవితాల్లో ఎన్ని కష్టాలుంటాయో చెప్పడానికి సెలినా జీవితమే ఓ ఉదాహరణ. ఇటీవల ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది.

27
పెళ్లి బంధంలో నరకం చూసిన సెలినా
2010లో ఆస్ట్రియా వ్యాపారవేత్త పీటర్ బాగ్‌ను సెలినా పెళ్లి చేసుకుంది. ముగ్గురు కొడుకులతో ఆమె సంసారం హ్యాపీగా ఉందని అందరూ అనుకున్నారు. కానీ ఆ బంధం వెనుక తాను 'నరకం' అనుభవించానని సెలినా ఇప్పుడు బయటపెట్టింది. విడాకుల తర్వాత ఆమె పడిన ఆర్థిక, మానసిక ఇబ్బందుల గురించి వివరించింది.
37
20కోట్ల ఆస్తిని పోగొట్టుకున్న సెలినా
విడాకుల గొడవలో సెలినా జైట్లీ భారీగా నష్టపోయింది. పెళ్లికి ముందు తాను కష్టపడి సంపాదించుకున్న రూ. 20 కోట్ల విలువైన ఆస్తిని కోల్పోవాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 'ప్రేమ, నమ్మకంతో కట్టుకున్న బంధం విడిపోయినప్పుడు, భావాల కన్నా డబ్బు, ఆస్తికే ఎక్కువ విలువ ఇస్తారు' అంటూ తన అనుభవంతో ఓ కఠిన నిజాన్ని చెప్పింది.
47
పెళ్లి రోజే విడాకుల నోటీసు
సెలినా జీవితంలో అత్యంత బాధాకరమైన క్షణం తన పెళ్లిరోజునే ఎదురైంది. అదే రోజు ఆమె భర్త విడాకుల నోటీసు పంపాడు. ఆ నోటీసు ఆస్ట్రియన్ జర్మన్ భాషలో ఉండటంతో, దాన్ని చదివి అర్థం చెప్పమని తన చిన్న పిల్లలను అడగాల్సి వచ్చింది. ఆ క్షణం తన జీవితంలో అత్యంత వేదనకు గురిచేసిందని సెలినా చెప్పుకొచ్చింది.
57
మహిళలకు సెలినా సందేశం
తన వ్యక్తిగత బాధ నుంచి బయటపడిన సెలినా, ఇప్పటి మహిళలకు ఓ ముఖ్యమైన సలహా ఇచ్చింది. 'పెళ్లికి ముందే ఆస్తి, హక్కుల గురించి 'ప్రి-నప్' (Prenuptial Agreement) ఒప్పందం చేసుకోవడం చాలా ముఖ్యం' అని ఆమె నొక్కి చెప్పింది. ప్రేమలో ఉన్నప్పుడు ఆస్తి గురించి మాట్లాడటం తప్పని అనుకోవద్దని, అదే మీ భవిష్యత్తుకు రక్షణ కవచం అని ఆమె సూచించింది. తన అనుభవం దృష్ట్యా, ఈ ఒప్పందం మహిళల హక్కులను కాపాడుతుందని సెలినా అభిప్రాయపడింది.
67
విదేశాల్లో ఇది కామన్‌
ప్రి-నప్ ఒప్పందం అంటే, ఒకవేళ విడాకులు తీసుకుంటే ఆస్తులు, పొదుపు, పెట్టుబడులు, ఇతర ఆర్థిక విషయాలను ఎలా పంచుకోవాలో పెళ్లికి ముందే రాసుకునే ఒప్పందం. విదేశాల్లో ఇది చాలా సాధారణం. కానీ, మన దేశంలో దీనిపై ఇంకా అంతగా అవగాహన లేదు. 'మహిళలు ఇలాంటి చట్టపరమైన విషయాలు తెలుసుకోవాలి, అవసరమైతే న్యాయ సలహా తీసుకోవాలి' అని సెలినా సూచించింది.
77
ఆస్తి, హక్కుల విషయంలో ముందు జాగ్రత్తలు
మొత్తం మీద, సెలినా జైట్లీ చెప్పిన ఈ నిజాలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. 'ఆస్తి హక్కులు, పిల్లల సంరక్షణ విషయంలో మహిళలు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పడానికి సెలినా జీవితంలోని ఈ చేదు అనుభవాలే సాక్ష్యం' అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories