ఈరోజు ఎపిసోడ్ లో సామ్రాట్ మీరు ఇంకా బయలుదేరొచ్చు అనడంతో ఇంకొకసారి ఆలోచించుకోండి తర్వాత మీరు చాలా నష్టపోతారు అని అంటాడు. అప్పుడు బెనర్జీ నువ్వు కాకపోతే ఇంకా వందమంది వస్తారు మార్కెట్లో మీది మంచి కంపెనీ కదా అని వచ్చాను అంతే అని అంటాడు. అప్పుడు తులసి చూడండి బెనర్జీ గారు ఇలాంటి అర్హత లేని ప్రాజెక్టుని మేమే కాదు ఇంకెవరిని చేయనివ్వము అనడంతో వెంటనే బెనర్జీ ఏంటి నాకే వార్నింగ్ ఇస్తున్నావా అని అంటాడు. మీలాంటి వాళ్లకు అలాంటి భాషలోని చెప్పాలి. జనాలను మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకోము. చరిత్ర ఎంత తెలుసుకునే మాట్లాడుతున్నాము అనడంతో షట్ అప్ అని గట్టిగా అరుస్తాడు బెనర్జీ.