యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD చిత్రం రెండవ వారంలో కూడా అద్భుతమైన వసూళ్లతో దుసుకుపోతోంది. మరోసారి ప్రభాస్ కి బాహుబలి స్థాయి విజయం దక్కింది అని అంతా అంటున్నారు. మహాభారతంలోని అంశాలని, కలియుగంతో ముడిపెడుతూ నాగ్ అశ్విన్ సృష్టించిన సైన్స్ ఫిక్షన్ కథ అద్భుతంగా వర్కౌట్ అయింది.