కేథరిన్ కిల్లింగ్ ఫోజులు.. చూపులతోనే గుండెల్ని గుచ్చేస్తున్న లేడి ఎమ్మెల్యే

First Published | Nov 14, 2021, 3:34 PM IST

అందాల భామ కేథరిన్ తన గ్లామర్ కంటే తక్కువ క్రేజ్ కే పరిమితం అయింది. ఆమె ఖాతాలో ఎక్కువ విజయాలు లేకపోవడమే కారణం. కేథరిన్ చమ్మక్ చల్లో చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

అందాల భామ కేథరిన్ తన గ్లామర్ కంటే తక్కువ క్రేజ్ కే పరిమితం అయింది. ఆమె ఖాతాలో ఎక్కువ విజయాలు లేకపోవడమే కారణం. కేథరిన్ చమ్మక్ చల్లో చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2013లో ఆ చిత్రం విడుదలయింది. అదే ఏడాది అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకుంది.

ఇద్దరమ్మాయిలతో చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించలేదు.కానీ ఆ చిత్రంలో Catherine Tresa లుక్స్, డాన్సులు చూసి తప్పకుండా టాప్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కుర్రాళ్ళు ఆమె గ్లామర్, ఎనెర్జీకి ఫిదా అయ్యారు. చూడగానే ఆకట్టుకునే రూపం ఉన్న కేథరిన్ కు అదృష్టం కలసి వచ్చి ఉంటే ఆమె స్టార్ లీగ్ లో ఉండేది. 


కేథరిన్ గ్లామర్ కు తగ్గట్లుగా అవకాశాలు వచ్చాయి. కానీ పరాజయాలు ఎదురుకావడంతో పోటీలో వెనుకబడింది. దీనితో ఆమెకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. 

మరోసారి అల్లు అర్జున్ సరసన నటించిన సరైనోడు చిత్రం కేథరిన్ కెరీర్ కు ఊపిరిపోయిందని చెప్పొచ్చు. ఆ చిత్రంలో లేడి ఎమ్మెల్యే పాత్రలో కేథరిన్ అదరగొట్టేసింది.

సరైనోడు చిత్రం తర్వాత కేథరిన్ నేనే రాజు నేనే మంత్రి, జయజనాకి నాయక లాంటి చిత్రాల్లో నటించింది.కేథరిన్ చివరగా తెలుగులో నటించిన చిత్రం విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్'. ఈ చిత్రం నిరాశపరిచిన సంగతి తెలిసిందే. 

కేథరిన్ వెండి తెరపై ఎప్పుడూ హద్దులు దాటి అందాలు ప్రదర్శించలేదు. సహజ సిద్దంగానే కేథరిన్ తన గ్లామర్ లుక్స్ తో యువతని ఆకట్టుకుంటోంది. ఓవర్ ఎక్స్ పోజింగ్ లేకుండా హాట్ గా కనిపించడం ఈ భామకి తెలుసు. 

తాజాగా కేథరిన్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన పిక్స్ స్టన్నింగ్ అనిపించేలా ఉన్నాయి. కారులో కూర్చుని మెరూన్ డ్రెస్ లో థైస్ అందాలు ఆరబోస్తూ ఇస్తున్న ఫోజులు మతిపోగొట్టేలా ఉన్నాయి. మరో డిఫెరెంట్ డ్రెస్ లో కూడా కేథరిన్ గ్లామరస్ గా ఫోజులు ఇచ్చింది. కేథరిన్ గ్లామర్ పిక్స్ ప్రస్తుతం =సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

అలాగే చీరలో కూడా కేథరిన్ సోఫాలో స్టైలిష్ గా కూర్చుని ఫోజులు ఇచ్చింది. కేథరిన్ హాట్ లుక్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. గ్లామర్ పరంగా తనకు తిరుగులేదని కేథరిన్ మరోసారి నిరూపించింది. 

Latest Videos

click me!