Published : Feb 16, 2022, 09:34 AM ISTUpdated : Feb 16, 2022, 09:38 AM IST
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీ లహరి(Bappi Lahari) మరణించారు. ఈ రోజు ఉదయం ముంబయ్ లోని ఓప్రైవేట్ హస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఆయన తుదిశ్వాస విడిచారు. తెలుగు సినిమా సంగీతంపై చెరగని ముద్ర వేశారు బప్పీ లహరి.
బాలీవుడ్ ను తన సంగీతంతో ఒక ఊపు ఊపిన బప్పీ లహరి(Bappi Lahari)... ఇటు సౌత్ లో కూడా తన మార్క్ చూపించారు. అయితే చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా.. ఇప్పటికీ.. ఎప్పటికీ.. మారు మోగేలా ఎవర్ గ్రీన్ సాంగ్స్ ను సౌత్ సినిమాకు అందించారు బప్పీలహరి(Bappi Lahari). ముఖ్యంగా తెలుగు సినిమాలకు ఆయన చేసిన మ్యూజిక్ ఇప్పటి కుర్ర కారుతో కూడా స్టెప్పులేయిస్తుంది.
211
తెలుగులో ఎవరగ్రీన్ సాంగ్స్ ను అందించారు బప్పీ లహరి(Bappi Lahari). ఆయన సంగీతానికి కాలు ఆటోమాటిక్ గా స్టెప్ వేస్తుంది. డాన్స్ రాని వారికి కూడా ఊపు వస్తుంది. అలాంటి బీట్స్ ఇచ్చేవారు ఆయన. అందుకే తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. బప్పీ లహరి అనగానే ఆయన పాటలు గుర్తుకు వచ్చి ఒళ్లు పులకరిస్తుంది.
311
టాలీవుడ్ లో బప్పీ లహరి(Bappi Lahari) ఫస్ట్ మూవీ కృష్ణ హీరోగా నటించిన సింహాసనం. ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్. అసలు చెప్పాలంటే ఈ పాటలు సినిమా సక్సెస్ లో ముఖ్య పాత్ర పోషించాయి అని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఆకాశంలో ఒక తార పాటి ఇప్పటికీ మారు మోగుతూనే ఉంటుంది.
411
ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన సినిమా మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్ లీడర్. ఈ సినిమా సక్సెస్ లో మెగాస్టార్ యాక్టింగ్.. డాన్స్.. డైరెక్షన్ ఎంత ఉందో.. బప్పీ లహరి మ్యూజిక్ కూడా అంతే ఉంది. బప్పీ ట్యూస్ కు రెచ్చిపోయి డాన్స్ వేశారు చిరంజీవి. గ్యాంగ్ లీడర్ లో ఆయన అందించిన వెష్ట్రన్,క్లాసిక్ మిక్డ్స్ ట్యూన్స్ కు ఆడియన్స్ మైమరిచపోయారు.
511
ఒకటా రెండా.. గ్యాంగ్ లీడర్ సాంగ్స్ అన్నీ సూపర్ హిట్టే.. ఒక రకంగా చెప్పాలి అంటే.. మెగాస్టార్ ఇమేజ్ పెరగడంలో బప్పీ లహరి మ్యూజిక్ పాత్ర పక్కాగా ఉంది. ఈ మూవీలో టైటిల్ సాంగ్ తో పాటు.. అన్ని పాటలు ఒక ఊపు ఊపాయి. గ్యాంగ్ లీడర్ కంటే ముందు మెగాస్టార్ కు స్టేట్ రౌడీ సినిమాకు మ్యూజిక్ చేశారు బప్పీ లహరి(Bappi Lahari). ఆతరువాత కూడా చిరంజీవికి రౌడీ అల్లుడు లాంటి సినిమాలకు పనిచేశారు బప్పి.
611
ఇక టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ అందించారు బప్పీ లహరి(Bappi Lahari). నటసింహం బాలకృష్ణకు కూడా కొన్ని సినిమాలు చేశారు. రౌడీ ముఖ్యంగా రౌడీ ఇన్పెక్టర్.. నిప్పురవ్వ లాంటి సూపర్ హిట్ 100 డేస్ మూవీస్ కు బప్పీ లహరి అదిరిపోయే ట్యూన్స్ ను అందించారు.
711
ఇవే కాదు తెలుగులో దాదాపు 30 సినిమాల వరకూ బప్పీ లహరి(Bappi Lahari) మ్యూజిక్ అందించారు మెహన్ బాబుకు రౌడీగారి పెళ్లాం, పుణ్యభూమి నా దేశం లాంటి సినిమాలకు ట్యూన్ చేశారు బప్పి. ఆయన మోహన్ బాబు సినిమాల కోసం ట్యూన్ చేసిన పాటలో..కుంతీ కుమారి, బోయవాని వేటుకు గాయపడిన కోయిల లాంటి పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచాయి.
811
ఇవే కాదు బప్పీ లహరి(Bappi Lahari) నుంచి మరెన్నో అద్భతమైన తెలుగు పాటలు పురుడు పోసుకున్నాయి. బిగ్ బాస్, రౌడీ రాజకీయం, బ్రహ్మ, త్రిమూర్తులు, శంకారావం, ఖైదీ ఇన్పెక్టర్ లాంటి ఎన్నో సినిమాలకు బప్పీ లహరి మ్యూజిక్ చేశారు.
911
బప్పీ లహరి(Bappi Lahari) తుది శ్వాసవరకూ మ్యూజిక్ ప్రాణంగా బ్రతికారు. పాటకు సంబంధించని పనులు చేస్తూనే గడిపారు. ఆయన చివరిగా హిందీలో బాఘీ3కి పనిచేవారు. అదే ఏడాది టాలీవుడ్ లో రవితేజ హీరోగా వచ్చిన డిస్కోరాజ సినిమాకు పాట పాడారు.
1011
తెలుగు ఇండస్ట్రీకి ఆయనకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ముఖ్యంగా బప్పీ లహరి (Bappi Lahari)కి హైదరాబాద్ అంటే అమితమైన ప్రేమ. జూబ్లీ హిల్స్ అంటే కూడా చాలా ఇష్టం. హైదరాబాద్ తనకు రెండో ఇల్లు లాంటిది అని ఎన్నో సార్లు బప్పీ లహరి(Bappi Lahari) అన్నారు.
1111
బప్పీ లహరి(Bappi Lahari) పుట్టింది పెరిగింది కోల్ కతాలో.. మ్యూజిక్ డైరెక్టర్ గా సెటిల్ అయ్యింది ముంబయ్ లో.. అయినా సరే తనకు ఈ రెండు ప్రాంతాల తరువాత బాగా ఇష్టమైన ప్రదేశం హైదరాబాద్ అంటారు ఆయన. తెలుగు సినిమా తనకు మంచి గుర్తింపు ఇచ్చింది అంటూ చెప్పేవారు బప్పి లహరి(Bappi Lahari).