నిర్మాత బండ్ల గణేష్ గురించి పరిచయం అవసరం లేదు. మైక్ పట్టుకున్నాడంటే ఇక ఎవరినీ పట్టించుకోరు. ఆ ప్రసంగం ప్రవాహంలా సాగుతూనే ఉంటుంది. ఇటీవల చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ పూరి జగన్నాధ్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. నిర్మాతగా బండ్ల గణేష్ గబ్బర్ సింగ్, టెంపర్, బాద్షా లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించారు.