పూరి లేకుండా హోటల్ లో ఛార్మి, విజయ్.... చిల్ అవుతున్న హీరో అండ్ ప్రొడ్యూసర్!

Published : Jul 26, 2022, 01:40 PM IST

లైగర్ నిర్మాత ఛార్మి, హీరో విజయ్ దేవరకొండ హోటల్ లో చిల్ అవుతూ కనిపించారు. ఇద్దరూ డిన్నర్ నైట్ లో షాంపేన్ తాగుతూ కనిపించారు. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.   

PREV
16
పూరి లేకుండా హోటల్ లో ఛార్మి, విజయ్.... చిల్ అవుతున్న హీరో అండ్ ప్రొడ్యూసర్!
Liger Movie

లైగర్(Liger Movie) మూవీ సక్సెస్ పై చిత్ర యూనిట్ పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ దక్కడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లైగర్ ట్రైలర్ (Liger Trailer)అన్ని భాషల్లో కలిపి 60 మిలియన్స్ కి పైగా వ్యూస్ రాబట్టింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో లైగర్ ట్రైలర్ దుమ్మురేపింది. పూరి మార్క్ హీరోగా ట్రైలర్ లో విజయ్ సరికొత్తగా కనిపించాడు. 
 

26

ఇక ట్రైలర్ సక్సెస్ నేపథ్యంలో నిర్మాత ఛార్మి, హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) డిన్నర్ నైట్ లో కలిశారు. ఓ ప్రైవేట్ హోటల్ లో షాంపేన్ తాగుతూ చిల్ అయ్యారు. విజయ్ దేవరకొండతో పార్టీ చేసుకుంటున్న ఫోటోను ఛార్మి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతుంది. ఇక లైగర్ ట్రైలర్ సక్సెస్ సెలెబ్రేషన్స్ అంటూ ఛార్మి ఆ ఫోటోకు కామెంట్ పెట్టారు. 
 

36

ఈ పార్టీలో డైరెక్టర్ పూరి(Puri Jagannadh) లేకపోవడం విశేషం. ఛార్మి షేర్ చేసిన ఫొటోలో పూరి మిస్ అయ్యాడు. లైగర్ విడుదలకు కేవలం 30 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఆయన చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పనుల్లో బిజీగా ఉండొచ్చు. అలాగే చిత్ర ప్రమోషన్స్ ప్రణాళికలలో ఆయన తలమునకలై ఉండవచ్చు. ఆ కారణంగా ఛార్మి, విజయ్ దేవరకొండతో ఆయన జాయిన్ కాలేదు.

46

లైగర్ మూవీ ప్రకటన తర్వాత పూరి-ఛార్మి టీమ్ లో విజయ్ దేవరకొండ ఒకరిగా మారిపోయాడు. వారిద్దరితో ఆయనకు మంచి అనుబంధం ఏర్పడింది. ఆ కారణంగానే లైగర్ విడుదల కాకుండా దర్శకుడు పూరితో మరో ప్రాజెక్ట్ చేస్తున్నారు. దేవరకొండ-పూరి కాంబినేషన్ లో జనగణమన టైటిల్ తో పాన్ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్నారు.  ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. 
 

56

ఈ మధ్య పూరి, ఛార్మి, విజయ్ ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు. తరచుగా ఈ త్రయం పార్టీలలో పాల్గొంటూ ఉంటారు. పనిలో పనిగా లైగర్ మూవీ పనులు పూర్తి చేస్తూ ఉంటారు. లైగర్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కగా బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. వీరు అధికంగా ముంబైలో ఉండడానికి అది కూడా ఒక కారణం. 
 

66


అందులోనూ కథ రీత్యా అధిక భాగం ముంబైలో షూట్ చేశారు. మురికివాడల్లో పెరిగిన ఓ పేద కుర్రాడు ప్రపంచం మెచ్చిన ఫైటర్ ఎలా అయ్యాడనేది లైగర్ కథగా తెలుస్తుంది. అనన్య పాండే హీరోయిన్ గా నటించగా ఆగస్టు 25న గ్రాండ్ గా విడుదల కానుంది. 
 

click me!

Recommended Stories