అప్పుడు తులసి, శృతి గురించి అడగడంతో వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్లిందని అనగా వెంటనే తులసి ఫోన్ చేయమనడంతో ప్రేమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అలా మొత్తానికి ప్రేమ్ ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు. అప్పుడు అనసూయ ప్రేమ్ ని ఏమైంది మీరు ఏమన్నా గొడవ పడ్డారా అని అడగగా వెంటనే తులసి వారిద్దరి మధ్య గొడవలు జరగవు అని అంటుంది.