క్రేజి న్యూస్.. మహేష్ బాబు - త్రివిక్రమ్ మూవీలో నేచురల్ స్టార్, నిజమెంత..?

First Published | May 20, 2022, 12:13 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్నాడా..? ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ లో నిజమెంత..? ఏ సినిమాలో నానీని తీసుకోబోతున్నారు..?

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్, నేచురల్ స్టార్ నానీ ఈఇద్దరి క్రేజ్ డిఫరెంట్. ఒకరికి మరొకరు సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతారు. అటువంటిది ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ కు పండగే. కాని అసలు ఇది జరిగే పనేనా... ?
 

నేచురల్ స్టార్ నానీ.. ఫస్ట్ సినిమా అష్టా చమ్మ లో.. నానీ మహేష్ బాబు అనేమారు పేరుతో తిరుగుతుంటాడు. ఈసినిమా మొత్తం మహేష్ బాబు పేరుమీదనే నడుస్తుంది. కాని మహేష్ కి ఈసినిమాకు సంబంధం ఉండదు. అటువంటిది మహేష్ తో నానీ సినిమా చేస్తున్నాడంటూ వస్తున్న రూమర్స్ పై ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 


త్రివిక్రమ్ సినిమా అంటే అది అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఆ సినిమాలు ఉంటాయి. అంతలా ఆయన తన సినిమా కథల్లో అన్ని అంశాలను అందంగా సర్దుతారు. ఇక త్రివిక్రమ్  తాజాగా మహేశ్ బాబు హీరోగా సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసమే త్రివిక్రమ్ అన్ని ఏర్పాట్లను రెడీ చేసుకుంటున్నారు. 

త్వరలోనే త్రివిక్రమ్ మహేష్ బాబు ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. మహేశ్ తో త్రివిక్రమ్ చేస్తున్న మూడో సినిమా ఇది. దాంతో సినిమాపై అవచనాలు సహజంగానే భారీగా పెరిగాయి. త్రివిక్రమ్ కు సహజంగానే ఓ అలవాటు ఉంది. తన సినిమాల్లో స్టార్ హీరోతో పాటు మరో యంగ్ హీరోను తీసుకుంటాడు. మహేష్ బాబు సినిమాకు కూడా అదే ఫార్ములా అప్లై చేయబోతున్నాడట త్రివిక్రమ్. 

ప్రతీ సినిమాకు పెద్ద ఆర్టిస్టులను పెడుతుంటారు త్రివిక్రమ్. అతిథి పాత్రల కోసం కూడా స్టార్లనే పట్టుకొస్తుంటారు. అలా ఈ సినిమాలోని ఒక గెస్టు రోల్ కోసం నేచురల్ స్టార్  నానీని సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. 
 

త్రివిక్రమ్ ఈ విధంగా ప్రయత్నం కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. పాత్ర ఇంపార్టెన్స్  ను బట్టి, కథ  నచ్చితే చేయడానికి నానీకి అభ్యంతరం ఉండకపోవచ్చు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  నానీ ఈసినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. టాలీవుడ్ లో మరో ఇంట్రెస్టింగ్ అండ్ రేర్ కాంబినేషన్ ను ఆడియన్స్ చూసే అవకాశం ఉంటుంది. 

 ఒకవేళ నాని మరే కారణం చేతనైనా చేయకపోతే, ఆ తరువాత ఆప్షన్ ఎవరనేదే చూడాలి. ఇక సూపర్ స్టార్ జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న ఈసినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతోంది. త్రివిక్రమ్ సినిమా తరువాత రాజమౌళి సినిమాలో జాయిన్ కాబోతున్నాడు మహేష్. 

Latest Videos

click me!