వెండితెరను ఏలిన లెజెండ్స్ ఎన్టీఆర్, ఏఎన్నార్ నటవారసులుగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున, బాలకృష్ణ తండ్రులకు తగ్గ తనయులు అనిపించుకున్నారు. మూడో తరం స్టార్స్ గా వాళ్ళు ఎదిగారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుండి ఈ రెండు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం ఉండేది. ఒకరింటికి మరొకరు రావడం పోవడం, వేడుకలకు హాజరు కావడం చేసేవారు.