`అన్‌స్టాపబుల్‌విత్‌ ఎన్బీకే2` షోకి బాలయ్య తీసుకునే పారితోషికం.. ఎంతో తెలిస్తే మైండ్‌ బ్లాకే?

Published : Oct 21, 2022, 04:12 PM IST

బాలకృష్ణ హోస్ట్ గా మారి సంచలనాలు సృష్టిస్తున్నారు. ఆయన యాంకర్‌గా చేస్తున్న టాక్‌ షో `అన్‌స్టాపబుల్‌విత్‌ఎన్బీకే` విజయవంతంగా రన్‌ అవుతుంది. ఇండియాలోనే నెంబర్‌ వన్‌ షోగా రన్‌ అవుతుంది.

PREV
16
`అన్‌స్టాపబుల్‌విత్‌ ఎన్బీకే2` షోకి బాలయ్య తీసుకునే పారితోషికం.. ఎంతో తెలిస్తే మైండ్‌ బ్లాకే?

బాలకృష్ణని యాంకర్‌గా ఎవరూ ఊహించలేదు. కానీ `ఆహా` టీమ్‌, అల్లు అరవింద్‌ కి ఆ ఐడియా వచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్‌ చేయగా, ఫలితమే `అన్‌స్టాపబుల్‌విత్‌ ఎన్బీకే` షో. ఇది `ఆహా` ఓటీటీలో ప్రసారమవుతుంది. గతేడాది ప్రారంభమైన ఈ షోకి ఇండియా వైడ్‌గా విశేష ఆదరణ దక్కింది. ఇప్పుడు రెండో సీజన్‌ ప్రారంభమై దూసుకుపోతుంది. 
 

26

మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గెస్ట్ గా రెండో సీజన్‌ ప్రారంభమైంది. తొలి ఎపిసోడ్‌ రికార్డ్ వ్యూస్‌ రావడం విశేషం. ఇదొక సంచలనాత్మక ఎపిసోడ్‌గా మారింది. `ఎన్టీఆర్‌ వెన్నుపోటు` అంశం ప్రధానంగా సాగిన ఈ ఎపిసోడ్‌ బాగా హైలైట్‌ అయ్యింది. అదే సమయంలో `అన్‌స్టాపబుల్‌` సినిమా ప్రముఖులే కాదు, రాజకీయ ప్రముఖులు కూడా రావచ్చనే సాంకేతాలనిచ్చింది. ఇదొక మరో స్టెప్‌ అని చెప్పొచ్చు. 
 

36

ఇప్పుడు డీజే టిల్లు ఫేమ్‌ సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్‌ సేన్‌లు గెస్ట్ గా వచ్చింది. ప్రస్తుతం ఇది స్ట్రీమింగ్ అవుతుంది. నెక్ట్స్ అడవిశేషు, శర్వానంద్‌ రాబోతున్నారు. అలాగే ఈ సారి పవన్‌ కళ్యాణ్‌, చిరంజీవిలను కూడా ఈషోకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు నిర్వహకులు. దీంతో మరింత ఆసక్తి నెలకొంది. 
 

46

ఇదిలా ఉంటే `అన్‌స్టాపబుల్‌` షో అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోవడం వెనకాల హోస్ట్ బాలయ్య పాత్ర కీలకమని చెప్పొచ్చు. ఆయన తన ఇమేజ్‌ని పక్కన పెట్టి ఈ షోని చేస్తున్నారు. అలాగే తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. బాలయ్యలో ఓ సరదా మనిషి, చిలిపికృష్ణుడు ఉన్నాడనే విషయాన్ని ఈ షో ద్వారా తెలిసేలా చేస్తున్నారు. ఇదే షోకి హైలైట్‌గా, సక్సెస్‌ సీక్రెట్‌గా నిలుస్తుంది. 
 

56

ఇదిలా ఉంటే ఈషోకి బాలకృష్ణ ఎంత రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా, ఇంట్రెస్టింగ్‌ విషయంగా మారింది. తాజాగా ఈ రెమ్యూనరేషన్‌ మ్యాటర్‌  ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తుంది. ఈ ఒక్క సీజన్‌కి బాలయ్య తీసుకునే రెమ్యూనరేషన్‌ భారీ స్థాయిలో ఉండటం విశేషం. 

66

`అన్‌స్టాపబుల్` మొదటి సీజన్‌కి బాలయ్య ఆరు కోట్లు పారితోషికంగా తీసుకున్నారట. దాదాపు పదికిపైగా ఎపిసోడ్లు చేశారు బాలయ్య. అయితే అది సక్సెస్‌ కావడంతో ఈ సారి పారితోషికం పెంచారని సమాచారం. రెండో సీజన్‌కి ఆయన రూ.9కోట్లు పారితోషికంగా అందుకుంటున్నారు. సీజన్‌ మొత్తానికి కలిపి ఆయన ఈ మొత్తాన్ని అందుకుంటున్నట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories