`తానా`లో బాలకృష్ణ హల్‌చల్‌.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి చేతుల మీదుగా సత్కారం..

Published : Jul 08, 2023, 05:01 PM IST

హీరో బాలకృష్ణ.. `తానా` వేడుకల్లో పాల్గొన్నారు. ఆమెరికాలో జరిగిన వేడుకలో ఆయన గెస్ట్ గా పాల్గొని సందడి చేశారు. ఆయన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సత్కరించడం విశేషం.   

PREV
16
`తానా`లో బాలకృష్ణ హల్‌చల్‌.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి చేతుల మీదుగా సత్కారం..

`తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్ ఆమెరికా`(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) 23వ మహాసభలు మూడు రోజులపాటు జరుగుతున్నాయి. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఈ మహాసభలు జరుగుతున్నాయి. దీనికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌లతోపాటు బాలకృష్ణ హాజరయ్యారు. ఇందులో నిర్మాత దిల్‌రాజు కూడా పాల్గొనడం విశేషం. యాంకర్‌ సుమ ఈ మహాసభలను హోస్ట్ చేశారు. 
 

26

అమెరికాలోని ఫిలడెల్ఫియాలో గల పెన్సిల్వేనియా కాన్ఫరెన్స్ హాలులో జులై 7, 8, 9తేదీల్లో మూడు రోజులపాటు ఈ తానా మహాసభలను నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో బాలయ్య పాల్గొని సందడి చేశారు. ఆయన స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఇందులో బాలకృష్ణని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సత్కరించడం విశేషం. 
 

36

ఆయనతోపాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ని సైతం వేదికపై వెంకయ్య నాయుడు సత్కరించారు. అందులో ఎన్‌ఆర్‌ఐలతో కలిసి వీరంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో ఎర్రబెల్లి దయాకర్‌ మాట్లాడుతూ తెలుగు వారు ఎక్కడ ఉన్న ఒక్కటే అని తెలిపారు. 

46

23వ తానా మహాసభల్లో బాలకృష్ణ ఉత్సాహంగా పాల్గొన్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఎయిర్‌ పోర్ట్ నుంచే ఎన్‌ఆర్‌ఐలు ఆయనకు స్వాగతం పలికారు. ప్రస్తుతం ఆయా ఫోటోలు, వీడియో క్లిప్పులు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

56

అమెరికాలోని `తానా` మహాసభల ప్రాంగణంలో బాలకృష్ణతో తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు. ఫోటోలకు పోజులిస్తూ సందడి.

66

బాలకృష్ణ ప్రస్తుతం `భగవంత్‌ కేసరి` చిత్రంలో నటిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో ఇక్కడి ఓ నాయకుడి కథతో ఈ చిత్రం రూపొందుతుంది. అనిల్‌ రావిపూడి దర్శకుడు. కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీలీల ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రం దసరాకి రిలీజ్‌ కాబోతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories