కిర్రాక్ అవుట్ ఫిట్ లో మల్లు బ్యూటీ కిల్లింగ్ లుక్స్.. నాభీ చూపుతూ కవ్విస్తున్న మాళవికా మోహనన్.. పిక్స్

First Published | Jul 8, 2023, 4:37 PM IST

తమిళ హీరోయిన్ మాళవిక మోహనన్ (Malavika Mohanan)  సూపర్ లుక్ లో దర్శనమిచ్చింది.  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ గా పంచుకున్న ఫొటోస్ అట్రాక్టివ్ గా ఉన్నాయి. 
 

కోలీవుడ్ లో వరుస చిత్రాలతో మాళవిక మోహనన్ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రాలు తెలుగులో డబ్ అయ్యి  ఇక్కడి ఆడియెన్స్ ను కూడా అలరించాయి. దీంతో తెలుగులోనూ ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ దక్కింది. ఇక త్వరలో ఇంట్రెస్టింగ్ మూవీతో థియేటర్లలో సందడి చేయనుంది.
 

ముఖ్యంగా తమిళ స్టార్ విజయ్ దళపతి సరసన ‘మాస్టర్’ చిత్రంలో నటించి మాళవిక మంచి ఫేమ్ దక్కించుకుంది. ఆ సినిమా తెలుగులోనూ మంచి ఆదరణ దక్కించుకుంది. ఫలితంగా మాళవికకు కూడా గుర్తింపు వచ్చింది. ఇక త్వరలో ఈ ముద్దుగుమ్మ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ లో నటించబోతోందని తెలుస్తోంది.
 


ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ట్రెండీ అవుట్ ఫిట్ లో ఫొటోషూట్లు చేస్తూ సందడి చేస్తోంది. అదిరిపోయే వేర్స్ లో స్టన్నింగ్ లుక్స్ తో కట్టిపడేస్తోంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోస్ అభిమానులతో పాటు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

బ్లూ కలర్ డెనిమ్ వేర్ లో స్టైలిష్ గా స్టిచ్ చేసిన దుస్తుల్లో మెరిసింది. మోడ్రన్ లుక్ లో మాళవికా అదరగొట్టింది. మరింత స్టైలిష్ గా, అట్రాక్టివ్ గా మెరిసింది. అలాగే నాభీ చూపిస్తూ గ్లామర్ మెరుపులు మెరిపించింది. మత్తు చూపులు, మతిపోయే ఫోజులతో చూపుతిప్పుకోకుండా చేసింది. 
 

నెక్ట్స్ తమిళంలో మాళవికా మోహనన్ నటించిన ‘తంగలాన్’ చిత్రం విడుదల కాబోతోంది. తమిళ స్టార్ చియాన్ విక్రమ్ సరసన మాళవికా నటించింది. రెండ్రోజుల కిందనే చిత్ర షూటింగ్ కూడా పూర్తైంది. దీంతో ఇప్పటి నుంచే నెట్టింట మెరుస్తూ తన సినిమాను ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. 
 

ఇక మాళవికా మోహనన్ ఎప్పటి నుంచో టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. ఈ విషయాన్ని తన ఫ్యాన్ తో చాట్ సెషన్ లో స్వయంగా వెల్లడించింది. ఇక ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్ ప్రకారం.. ప్రభాస్ - మారుతీ సినిమాలో మాళవిక నటిస్తున్నదని తెలుస్తోంది. దీంతో ఈ బ్యూటీ ఎంట్రీ గ్రాండ్ గా ఉంటుందని అర్థం అవుతోంది. 
 

Latest Videos

click me!