చాలా కాలంగా నందమూరి ఫ్యామిలీకి.. ఎన్టీఆర్ కు దూరం పెరిగింది అన్న వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. బాలయ్య తారక్ ను దూరం పెడుతున్నారని కొందరు.. జూనియర్ ఎన్టీఆర్ కావాలని బాలయ్యతో కలవడం లేదు అని కొందరు.. ఎవరి వాదన వారిది. అంతే కాదు చంద్రబాబు జైలుకు వెళ్ళినప్పుడు, అసెంబ్లీలో చంద్రబాబు భార్య, ఎన్టీఆర్ మేనత్త భువనేశ్వరిని అవమానించినప్పుడు తారక్ సరిగ్గా స్పందించలేదనే విమర్శలు గట్టిగా ఉన్నాయి. దాంతో ఎన్టీఆర్ తో బాలయ్యకు దూరం మరింతగా పెరిగిందనేది టాక్.