ఇక తారక్ కూడా ఆశ్వీర్వదించాడు కాబట్ట.. మోక్షజ్ఞ ఎంట్రీతో.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి కూడా సపోర్ట్ ఉంటుందని అర్ధం అవుతోంది. ఇక మోక్షూ మూవీ ఓపెనింగ్ కు తారక్ వస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయంలో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ -అల్లు అర్జున్ లు స్టార్ హీరోలుగా ఎదిగారు. కాని వారి మధ్య కోల్డ్ వార్ గురించి అందరికి తెలిసిందే. ఫ్యాన్స్ మధ్య కూదా కొన్ని ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఈక్రమంలో ఈ నందమూరి అన్నదమ్ముల మధ్య.. ఇండస్ట్రీలో సఖ్యత ఎలా ఉంటుందా అని చర్చించుకుంటున్నారు. చూడాలి మోక్షజ్ఞ ఎంట్రీ ఎలా ఉండబోతోందో.