ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీగా మొదలైన పేరు మార్పు వివాదం కాస్త... బాలయ్య వర్సెస్ ఎన్టీఆర్ అన్నట్లుగా మారింది. ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్సార్ పేరుపెట్టడాన్ని మనవడిగా జూనియర్ ఖండించారు. అయితే డిప్లొమాటిక్ గా స్పందించారు. ఎన్టీఆర్, వైఎస్సార్ లను సమాన స్థాయి నాయకులుగా అభివర్ణించాడు. పేరు మార్పు చర్య వైఎస్సార్ స్థాయి పెంచదు, ఎన్టీఆర్ స్థాయి తగ్గించదు.. అంటూ ట్వీట్ చేశాడు.