
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... సామ్రాట్,హనీ దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు హానీ కళ్ళు తెరిచి "నాన్న" అని అంటుంది. ఇంకా పడుకోలేదా అమ్మ అని అనగా, నాన్న నువ్వు నా దృష్టిలో హీరోవి కదా నువ్వు అలాగా అందరి ముందు ఆన్సర్ చేయలేదు ఎందుకు? మా అమ్మ గురించి వాళ్ళకి ఎందుకు చెప్పలేదు కనీసం నాకైనా చెప్తావా అని అనగా, సామ్రాట్ మౌనంగా ఉంటాడు. అప్పుడు హనీ, వద్దులే నాన్న నిన్ను ఇబ్బంది పెట్టే పని నేనేం చేయను. ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్పు అని అంటుంది.
అప్పుడు సామ్రాట్, హనీ నీ పడుకోబెట్టి బయటకు వస్తాడు. అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్, సామ్రాట్ తో,ఇప్పుడు నువ్వు తులసి వాళ్ళ దగ్గర చెడ్డవాడివి అయిపోయావురా నిన్నటి వరకు తులసి వాళ్ళకి నువ్వు ధైర్యంగా ఉండేవాడివి కానీ, అందరి ముందు తులసిని ఈరోజు ఒంటరిగా వదిలేశావు.తను ధైర్యం చేసి మాట్లాడింది కనుక సరిపోయింది లేకపోతే తన జీవితం ఏమైపోయి ఉండేది అని అంటాడు. దానికి సామ్రాట్, నేను చేసింది తప్పే బాబాయ్ ఒప్పుకుంటున్నాను కానీ నిజం చెప్పి హనీ మనసునీ నేను బాధ పెట్టలేను.
హనీ సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం అని అనగా సామ్రాట్ వాళ్ళ బాబాయ్, ఎన్నాళ్ళని నిజం దాచిపెట్టి ఉంచుతావురా ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అని అనగా ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు బాబాయ్ నా ప్రాణం ఉన్నంతవరకు నేను ఈ సమస్య మీద స్ట్రగుల్ అవుతూనే ఉంటాను అయినా తులసి నన్ను అర్థం చేసుకుంటుంది బాబాయ్. నన్ను నా కంపెనీని,ఈ రోజు తనే కాపాడింది. నాతో తోడుగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అని అంటాడు. ఆ తర్వాత సీన్లో అభి రాత్రి పడుకోకుండా జరిగిన విషమంతా ఆలోచించుకుంటూ తిరుగుతూ బయటకు వస్తాడు.
ఇంతలో నందు, లాస్యలు కూడా అభి దగ్గరికి వచ్చి, నీకు కూడా నిద్ర పట్టట్లేదు కదా అభి మాకు కూడా నిద్ర పట్టట్లేదు అంత జరిగినా సరే ఇంట్లో వాళ్ళందరూ అంతా హాయి గా ఎలా పడుకుంటున్నారు?అసలు ఇంటి పెద్ద కొడుకుగా నీకు బాధ్యత ఉంటుంది కదా! అందరి ముందు సామ్రాట్ నోరు విప్పలేదు అంటే దానికి అర్థం ఏంటి? మీ అమ్మ మాట్లాడింది కనుక సరిపోయింది లేకపోయి ఉంటే మీ ఇంటి పరువు ఏమైపోయేది?మీ డాడీ కంటే మాట్లాడే హక్కు లేదు కానీ నీకు బాధ్యత ఉన్నది కదా అని అనగా నందు, నువ్వు నాతో మాట్లాడుతున్నావు అని వాళ్ళు నీకు విలువ ఇవ్వడం మానేస్తున్నట్టున్నారు.
ఇంక నుంచి నాకు దూరంగా ఉండు అని అంటాడు.దానికి లాస్య, అందులో వీడు చేసిన తప్పు ఏముంది నందు. అయినా నువ్వు ఇంటి పెద్ద కొడుకు కదా నీకు అడిగే హక్కు ఉన్నది.మేము చెప్పాల్సింది చెప్పాము,ఇంక నీ ఇష్టం అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత రోజు తులసి కుటుంబం అంతా వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. అప్పుడు హనీ, ఉండండి తులసి ఆంటీ మీరు వెళ్లడం నాకు ఇష్టం లేదు అని అనగా అలా కాదమ్మా అని హనీ కి మచ్చ చెప్పి బయలుదేరుతున్నప్పుడు సామ్రాట్ తులసితో రేపు ఆఫీసులో కలుద్దాం తులసి గారు అని అంటాడు.అప్పుడు తులసి సరే అని అనగా అభి మాత్రం, నాకు ఇష్టం లేదు రేపటి నుంచి మా అమ్మ ఆఫీస్ కి రాదు, మీకు మా అమ్మకి ఇంకా రేపటి నుంచి ఎటువంటి సంబంధం ఉండదు.
ఇదే ఆఖరి రోజు అని అనగా, ఏం మాట్లాడుతున్నావు అభి పెద్దవాళ్లతో ఇలాగే నా మాట్లాడేది అని తులసి అంటుంది. అప్పుడు పరంధామయ్య హనీ నీ, లక్కీ నీ బయటకు వెళ్లి ఆడుకోమని చెప్తాడు.అప్పుడు అభి,తులసి తో,అలా కాదమ్మా ఈరోజు జరిగింది నువ్వు చూసావు కదా అలా అందరూ ముందు మౌనంగా ఉన్నారంటే దానికి మనం ఏమనుకోవాలి?బయట వాళ్ళు ఏమనుకోవాలి?. సరైన సమయానికి నువ్వు మాట్లాడకపోయి ఉంటే మీరు మళ్లీ పేపర్లోకి ఎక్కే వాళ్లు. మన కుటుంబ పరువు అంతా పోయేది. ఇంట్లోనీ, కంపెనీలోని హీరో అని పిలుస్తారు అందరి ముందు వెళ్తే సరిగా మాట్లాడడం కూడా రాదు. నిన్ను కఠినమైన పరిస్థితిలో వదిలేస్తే ఎలాగమ్మా అయినా తన భార్య గురించి అడిగితే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అని అంటాడు. అప్పుడు సామ్రాట్ వల్ల బాబాయి, హద్దు దాటుతున్నావు అభి ఇంకా చాలు అని అనగా అభి,నాకు తెలియాలి.ఆయన ఎందుకు మాట్లాడలేదు.
ఆయన భార్య చనిపోయిందా? లేకపోతే మీరే చంపేశారా? హంతకుడా కూడా అని అనగా సామ్రాట్ వాళ్ళ బాబాయి,ఇంక చాలు అభి.ప్రతిదానికి హద్దు ఉంటుంది అంత కూడా చేయని తప్పుకు తన జీవితాన్ని నాశనం చేసుకున్న హంతకుడు. సొంత చెల్లి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన హంతకుడు,కూతురు గాని కూతురు కోసం తన పెళ్లిని త్యాగం చేసిన హంతకుడు, మీలాంటి వాళ్ళు వేసే నిందలు మోస్తూ హనీ తన కూతురు కాదు తన చెల్లెలు కూతురు అని నిజాన్ని గుండెల్లోనే మోస్తున్న హంతకుడు.
వెళ్లి ఉరి కంభం ఎక్కించు అందరి చేత రాళ్ల చేత కొట్టించు అని అనగా ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు సామ్రాట్ వల్ల బాబాయ్ కుటుంబం సభ్యులందరితో, నిజం చివరి వరకు హనీ కి తెలియకూడదు అని తన ఆనందాన్ని దూరం చేయకూడదు అని ఇన్నాళ్లు తను మనసులోనే దాచుకున్నాడు కానీ మీరు ఇప్పుడు ఇన్ని మాటలు అనేసరికి ఆపుకోలేక నేనే చెప్పాను అని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!