హీరోలుగా పవన్‌, బాలయ్య, మహేష్‌ వారసులు.. అకిర, మోక్షజ్ఞ, గౌతమ్‌ టాలీవుడ్‌ ఎంట్రీకి ప్లాన్‌? ఫ్యాన్స్ కి పండగే

Published : May 28, 2022, 08:56 PM ISTUpdated : May 28, 2022, 10:33 PM IST

బాలయ్య వారసుడు, పవన్‌ తనయుడు, మహేష్‌ కొడుకు, సుమ కుమారుడు టాలీవుడ్‌లో హీరోలుగా ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్‌ జరుగుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలోకి కొత్త నీరు వస్తోంది.   

PREV
110
హీరోలుగా పవన్‌, బాలయ్య, మహేష్‌ వారసులు.. అకిర, మోక్షజ్ఞ, గౌతమ్‌ టాలీవుడ్‌ ఎంట్రీకి ప్లాన్‌? ఫ్యాన్స్ కి పండగే

సినిమా ఇండస్ట్రీలో వారసులకు కొదవలేదు. నందమూరి, మెగా, అల్లు, అక్కినేని, దగ్గుబాటి ఇలా అన్ని ఫ్యామిలీలకు చెందిన వారసులు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. హీరోలుగా రాణిస్తున్నారు. మరికొందరు ఇప్పుడు ఎంట్రీకి సిద్దమవుతున్నారు. రానున్న రోజుల్లో భారీ స్థాయిలో వారసుల ఎంట్రీ ఉండబోతుండటం విశేషం.
 

210

రాబోయే రోజుల్లో హీరోలుగా ఎంట్రీకి సంబంధించి నందమూరి ఫ్యామలీ నుంచి మరో వారసుడు రాబోతున్నారు. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీకి చాలా రోజులుగా ప్లాన్‌ జరుగుతుంది. ఆయన్ని హీరోగా పరిచయం చేయబోతున్నట్టు గతంలోనే ప్రకటించారు బాలయ్య. కానీ కథ, డైరెక్టర్‌ ఇంకా సెట్‌ కాలేదు. తన దర్శకత్వంలోనే మోక్షజ్ఞని `ఆదిత్య 369`కి సీక్వెల్‌తో హీరోగా ఎంట్రీ ఇప్పించబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు గట్టిగానే ప్లాన్‌ జరుగుతుందట. బాలయ్య పుట్టిన రోజు వచ్చే నెలలో ఉంది. ఈ సందర్భంగా ఏదైనా ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. 
 

310

మరోవైపు ఇటీవల పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కొడుకు అకిరా వార్తల్లో నిలిచారు. స్కూల్‌ గ్రాడ్యూయేషన్‌ పూర్తి కావడంతో సర్టిఫికేషన్‌ ఈవెంట్‌ జరిగింది. స్కూల్‌ డే ఫంక్షన్‌ జరిగింది. ఇందులో అకిరాతోపాటు పవన్‌ సందడి చేయడం విశేషం. ఆయన కూతురు ఆధ్య, అలాగే మాజీ భార్య రేణు దేశాయ్‌ కలిసి ఫోటోకి కూడా పోజులిచ్చారు. అయితే అందులో అకిర ఓ వయోలిన్‌ వాయించి ఆకట్టుకున్నారు. అప్పటి నుంచే త్వరలోనే అకిరా ఎంట్రీ ఉండబోతుందనే చర్చ మెగా అభిమానుల్లో మొదలైంది. 

410

ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి ఫ్యామిలీ నుంచి రామ్‌చరణ్‌, నాగబాబు ఫ్యామిలీ నుంచి వరుణ్‌ తేజ్‌, నిహారిక ఎంట్రీ ఇచ్చారు. తన సిస్టర్స్ నుంచి సాయితేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌లు ఎంట్రీ ఇచ్చారు. మరోవైపు అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌ హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్‌లో అతి పెద్ద ఫ్యామిలీగా మెగా ఫ్యామిలీ హీరోలుండటం విశేషం. 
 

510

అలాగే చూడబోతుంటే మహేష్‌ బాబు వారసులు కూడా రాబోతున్నారనే సిగ్నల్స్ ఇచ్చారు మహేష్‌. ఇప్పటికే తనయుడు గౌతమ్‌ `వన్‌ నేనొక్కడినే` బాల నటుడిగా నటించారు. ఇటీవలే ఆయన టెన్త్ పూర్తి చేసి ఫస్ట్‌ క్లాస్‌లో పాసయ్యారు. ఇప్పటికే చాలాహైట్‌ పర్సనాలిటీ పెరిగాడు గౌతమ్‌. ఇక వీలైనంత త్వరలోనే హీరోగా గౌతమ్‌ ఎంట్రీ ఉండబోతుందని టాక్‌ మొదలైంది. మరోవైపు కూతురు సితార సైతం సినిమాలంటే ఇష్టమని చెప్పింది. `సర్కారు వారి పాట` చిత్రంలోని పెన్నీ సాంగ్‌లోనూ కాసేపు మెరిసిన నేపథ్యంలో మున్ముందు ఆమె ఎంట్రీ కూడా ఖాయమనే సిగ్నల్స్ అందుతున్నాయి. 

610

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి సురేష్‌బాబు నిర్మాతగా రాణిస్తుండగా, వెంకటేష్‌ హీరోగా రాణిస్తున్నారు. సురేష్‌ బాబు ఇద్దరు కుమారుల్లో రానా ఇప్పటికే స్టార్‌ హీరో ఇమేజ్‌తో, విలక్షణ సినిమాలతో ఆకట్టుకుంటున్నారు. మరోవైపు చిన్న కుమారుడు అభిరామ్‌ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన సినిమా ఫస్ట్ లుక్‌ కూడా విడుదలైంది. `అహింస` పేరుతో సినిమా చేస్తున్నారు. వెంకటేష్‌ కుమారుడు అర్జున్‌ కూడా సినిమాల్లోకే వచ్చే ఛాన్స్ ఉందని టాక్‌.

710

ఇదిలా ఉంటే హీరో శ్రీకాంత్‌ కుమారుడు రోషన్‌ ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆయన `నిర్మల కాన్వెంట్‌`తో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా ఆశించిన రిజల్ట్ ని దక్కించుకోలేకపోయింది. ఆ తర్వాత ఇటీవల `పెళ్లిసందడి`తో మరోసారి ఎంట్రీ ఇప్పించారు. ఈ చిత్రంతో మంచి పేరుతెచ్చుకున్నారు. ఇప్పుడు వరుసగా సినిమాలతో బిజీ అవుతున్నాడు రోషన్‌. 

810

టాలీవుడ్‌లో పాపులర్‌ యాంకర్‌ సుమ కనకాల కొడుకు రోషన్‌ని హీరోగా ఎంట్రీ ఇప్పించాలని ప్లాన్‌ చేస్తుంది సుమ. ఇప్పటికే ఓ సినిమాని ప్రారంభించారు. కానీ అది ఆగిపోయింది. ఇప్పుడు మరో సినిమాకి ప్లాన్‌ జరుగుతుంది. వీలైనంత త్వరలోనే ఆమె తన కుమారుడు రోషన్‌ని తెరపైకి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. 

910

అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇప్పటికే నాగార్జున టాప్‌ హీరోల్లో ఒకరిగా ఉన్నారు. ఆయన ఇద్దరు కుమారులు నాగచైతన్య, అఖిల్‌ హీరోలుగా రాణిస్తున్నారు. స్టార్‌డమ్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు సుశాంత్‌, సుమంత్‌లు కూడా హీరోలుగా నిలబడేందుకు కష్టపడుతున్న విషయం తెలిసిందే.  

1010

నందమూరి కుటుంబం నుంచి ఎన్టీఆర్‌ నట వారసత్వాన్ని పునికి పుచ్చుకుని బాలకృష్ణ, హరికృష్ణ, ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌, తారకరత్న హీరోలుగా రాణిస్తున్నారు. టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేస్తున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories