బెడ్‌పై కొంటెగా పోజులిస్తూ రచ్చ చేస్తున్న దీప్తిసునైనా.. తలపై గుమ్మడికాయతో హంగామా..వీకెండ్‌ స్పెషల్‌

Published : May 28, 2022, 07:24 PM IST

బిగ్‌బాస్‌ బ్యూటీ దీప్తి సునైనాకి అసలైన అడ్డా ఏదైనా ఉందంటే అది సోషల్‌ మీడియానే. అందమైన ఫోటోలను పంచుకోవడంలోనూ, అప్‌డేట్లని ఇవ్వడంలోనూ, తన ప్రతి కదలికని పంచుకోవడానికైనా సామాజిక మాధ్యమాలే వేదికగా చేసుకుంటుంది.  

PREV
17
బెడ్‌పై కొంటెగా పోజులిస్తూ రచ్చ చేస్తున్న దీప్తిసునైనా.. తలపై గుమ్మడికాయతో హంగామా..వీకెండ్‌ స్పెషల్‌

హాట్‌ బ్యూటీ దీప్తిసునైనా(Deepthi Sunaina) అందాల విందుతో కనువిందు చేస్తుంది. లేటెస్ట్ గా బెడ్‌పైనే దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. బెడ్‌పై నిద్ర లేవగానే ఇలా కొంటెగా పోజులిచ్చింది. తలపై గుమ్మడికాయని పోలిన దిండుని పెట్టుకుని చిలిపిగా కనువిందు చేస్తుంది దీప్తి సునైనా. 

27

ప్రస్తుతం ఈ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఆమె అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. దీంతో వాటిని షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు నెటిజన్లు. వీకెండ్‌లో దీప్తిరచ్చ మామూలుగా లేదని చెప్పొచ్చు. 
 

37

దీప్తి సునైనా యూట్యూబ్‌ ద్వారా పాపులర్‌ అయ్యింది. యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ క్రేజ్‌ని సొంతం చేసుకుంటుంది. లవ్‌ బేస్డ్ వీడియోలు, పాటల్లో నటిస్తూ ఆకట్టుకుంటుంది. ఎమోషనల్‌ సీన్స్ ని రక్తికట్టించేలా చేస్తూ అందరి మన్ననలు పొందింది దీప్తి సునైనా. 

47

సోషల్‌ మీడియా ద్వారా వచ్చిన ఫాలోయింగ్‌, క్రేజ్‌ కారణంగా ఆమెకి బిగ్‌బాస్‌ 2లో పాల్గొనే ఛాన్స్ వచ్చింది. ఆ షోలో దీప్తి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అందులోనూ చిలిపిగా, చలాకీగా ఉంటూ హైలైట్‌గా నిలిచింది. 
 

57

ఆ తర్వాత మరో యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరు చాలా రోజులుగా సీక్రెట్‌గా తమ లవ్‌ స్టోరీని నడిపించారు. అయితే వీరి లవ్‌ స్టోరీ మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తరచూ చర్చనీయాంశమవుతుంది. 

67

కానీ షణ్ముఖ్‌ బిగ్‌బాస్‌ 5లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో జరిగిన పరిణామాల నేపథ్యంలో షణ్ముఖ్‌ హౌజ్‌ నుంచి బయటకు వచ్చాక వీరిద్దరు బ్రేకప్‌ చెప్పుకున్నారు. హౌజ్‌లో షణ్ముఖ్‌.. సిరిల మధ్య జరిగిన సంఘటనలే ఈ ఇద్దరి మధ్య బ్రేకప్‌కి కారణాలనే టాక్‌ వచ్చింది. ఏదేమైనా ఇప్పుడు ఎవరికి వారు సొంతంగా కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు. 

77

మరోవైపు దీప్తి ఎప్పటిలాగే యూట్యూబ్‌ వీడియోలు, గ్లామర్‌ ఫోటో షూట్లతో దూసుకుపోతుంది. నెటిజన్లని ఆకట్టుకుంటుంది. హాట్‌ హాట్‌ అందాలను ఆరబోస్తూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. సోషల్‌ మీడియాలో హాటెస్ట్ బ్యూటీగా నిలుస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories