Balakrishna, Nara Brahmani,Unstoppable with NBK
సినిమా వాళ్ల పిల్లలు సినిమాల్లోకి వస్తూంటారు. అందులో పెద్ద విశేషం ఏమి లేదు. విచిత్రమూ కాదు. అందులోనూ నందమూరి కుటుంబం అంటే నటనకు పెట్టింది పేరు. వెండితెరపైన నందమూరి తారక రామారావు గారి వెలుగు ఇప్పటికి వారిలో కనపిస్తూంటుంది.
ఆ కుటంబం నుంచి వచ్చిన బాలయ్య వెండితెరపై సింహంలా గర్జిస్తూంటారు. బాలయ్య వారసుడు మోక్షజ్ఞ త్వరలో వెండి తెరపై కనిపించబోతున్నారు. ఈ నేపధ్యంలో బాలయ్య కుమార్తె కు వచ్చిన సినిమా ఆఫర్ గురించి ఆయనే స్వయంగా చెప్పారు.
బాలకృష్ణ పెద్ద కుమార్తె .. నారా బ్రాహ్మణి ప్రత్యేకంగా పరిచయం పనిలేదు.. నారా లోకేష్ భార్యగా అలాగే ఆంధ్రా సీఎం చంద్రబాబు కోడలిగా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.అదే సమయంలో బిజినెస్ ఉమెన్ గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది బ్రాహ్మణి. అయితే ఆమె గురించి అంతకు మించి పెద్దగా బయిట ఎవరికీ ఏమీ తెలియదు. అయితే ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని బాలయ్య గుర్తు చేసి అందరికీ చెప్పారు.
తాను వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable with NBK)లో నాటి సంగతులు నెమరువేసుకున్నారు. ఆ షో సీజన్ 4.. ఎపిసోడ్ 8లో దర్శకుడు బాబీ (KS Ravindra), సంగీత దర్శకుడు తమన్ (Thaman S), నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi)గెస్ట్ లుగా పాల్గొని సందడి చేశారు. ఈ క్రమంలో ‘మీ ఇద్దరి అమ్మాయిల్లో ఎవరిని గారాబంగా పెంచారు?’ అని తమన్ అడగ్గా బాలకృష్ణ స్పందించారు. ఇద్దరినీ గారాబంగానే పెంచానని చెబుతూ మణిరత్నం సినిమా అవకాశాన్ని గుర్తుచేసుకున్నారు.
బాలయ్య మాట్లాడుతూ..‘‘మణిరత్నం గారు అప్పట్లో ఓ సినిమా కోసం హీరోయిన్‌గా బ్రాహ్మణిని అడిగారు. ఆ విషయాన్ని ఆమెకు చెబితే.. ‘మై ఫేస్’ (నా ముఖం) అని సమాధానమిచ్చింది. నీ ఫేస్ కోసమే అడుగుతున్నారని అన్నా. చివరకు ఆసక్తి లేదని చెప్పింది.
తేజస్విని మాత్రం అద్దంలో చూసుకుంటూ యాక్ట్ చేసేది. తనైనా నటి అవుతుందని అనుకున్నా. చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ షోకు ఆమె క్రియేటివ్ కన్సల్టెంట్. ఎవరి రంగంలో వారు మంచి పేరు తెచ్చుకున్నారు. ‘వాళ్ల తండ్రిని నేను’ అని చెప్పుకొనే స్థాయికి ఎదిగారంటే అంతకుమించి నాకు కావాల్సింది ఏముంది. నేను భయపడేది బ్రాహ్మణికే’’ అని అన్నారు.
అలాగే బ్రాహ్మణికి తన తండ్రి బాలయ్య కాకుండా మరొక హీరో అంటే కూడా చాలా ఇష్టమట. ఆ హీరో ఎవరో కాదు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. ఈయన నటన పరంగా, డాన్స్ పరంగా తనకి చాలా ఇష్టమని,చిరంజీవి హీరోగా సినిమా విడుదల అవుతుందంటే చాలు మొదటి రోజే ఈమె సినిమా చూడడానికి వెళుతుందట. ఈ విషయాన్ని బాలయ్యే ఒక ఇంటర్వ్యూలో స్వయంగా తెలియజేశారు.