వాటికే జీవితాన్ని త్యాగం చేసిన పుణ్యాత్మురాలు.. అమ్మ బసవరతారకం గురించి బాలకృష్ణ ఎమోషనల్‌ కామెంట్‌..

Published : Jul 06, 2024, 10:49 PM IST

బాలకృష్ణ ఎప్పుడూ నాన్న ఎన్టీరామారావు గురించే మాట్లాడతారు. కానీ అమ్మ బసవతారకం గురించి చెప్పింది తక్కువ. కానీ ఆమె గురించి రియాక్ట్ అయ్యాడు. ఎమోషనల్‌ అయ్యాడు బాలయ్య.   

PREV
16
వాటికే జీవితాన్ని త్యాగం చేసిన పుణ్యాత్మురాలు.. అమ్మ బసవరతారకం గురించి బాలకృష్ణ ఎమోషనల్‌ కామెంట్‌..

సినిమాల్లో, రాజకీయాల్లో ఎక్కువగా ఎన్టీఆ రామారావు ప్రస్తావనే వస్తుంది. ఆయన సినిమాలు, ఆయన రాజకీయం గురించే అంతా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత బాలకృష్ణ, హరికృష్ణ, కూతుళ్ల గురించి చర్చ, ప్రస్తావన వస్తుంటుంది. కానీ ఎన్టీఆర్‌ భార్య బసవతారకం గురించిన ప్రస్తావన చాలా తక్కువ. అరుదు అనే చెప్పాలి. 
 

26

కానీ ఎన్టీఆర్‌ సక్సెస్‌ వెనుక ఆమెనే ఉన్నారు. ఆయన సినిమాల్లో బిజీగా ఉంటే ఫ్యామిలీ చూసుకోవడమైనా, ఎన్టీఆర్‌ని అన్ని విధాలుగా చూసుకోవడంలో అయినా బసవతారకం కీలక భూమిక పోషించారు. బసవతారకం అంటే రామారావుకి కూడా ఎంతో ప్రేమ. అందుకే ఆమె కోసం ఆమె పేరుతోనే బసవతారకం ఆసుపత్రిని కూడా కట్టించారు. ఆమె 1984లో క్యాన్సర్‌తో చనిపోయిన నేపథ్యంలో ఎవరూ అలా చనిపోకూడదని ఆసుపత్రి కట్టించారు ఎన్టీ రామారావు. 
 

36

ఇదిలా ఉంటే తన అమ్మ గురించి బాలకృష్ణ స్పందించారు. ఇలా మీడియా ప్రముఖంగా అమ్మ గురించి చెప్పడం అరుదు అనే చెప్పాలి. అమ్మ గురించి చెబుతూ, ఆయన ఎమోషనల్ అయ్యారు.    బసవతారకం కూడా ఎన్టీఆర్‌తోనే మద్రాస్‌లోనే ఎక్కువగా ఉండేదట. బాలకృష్ణ, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లు అంతా హైదరాబాద్‌లో పెరిగారట. అప్పుడప్పుడు వస్తూ వెళ్తుంటారట. అయితే నాన్న ఎన్టీఆర్‌ది గెస్ట్ అప్పీయరెన్స్ అని, అప్పుడప్పుడు వస్తుంటే చూడటమే అని, ఎక్కువగా సినిమాల్లోనే చూసేవాళ్లమని చెప్పారు బాలయ్య. అమ్మ కూడా నాన్నతో పాటు మద్రాస్‌లో ఉండటంతో ఆమె కూడా తక్కువగానే ఉండేదని, కానీ ఆ తర్వాత తమని ఎక్కువ టేక్‌ కేర్‌ చేసిందని చెప్పారు.
 

46

`అమ్మగారు కూడా నాన్నతోపాటు మద్రాస్ లోనే ఉండేవాళ్లు. ఇక్కడికి రావడం చాలా తక్కువ. మేం హైదరాబాద్‌లో ఉండేవాళ్లం. ఆమె నాన్న గారికే తన జీవితాన్ని అంకితం చేసింది. ఆయన మార్నింగ్‌ మూడు గంటలకు లేస్తే, రెడీ అయ్యే లోపు టిఫిన్స్ రెడీ చేసి పెడుతుంది. మళ్లీ సాయంత్రం నాన్న షూటింగ్‌ నుంచి వచ్చేటప్పుడు సడెన్‌గా నాకు ఇది చేసి పెట్టు అంటే ఆయన వచ్చే లోపు ఆ వంటకాలు రెడీ చేసి పెట్టేది. నాన్నకి అమ్మ చేత్తోనే చేసి పెట్టాలి. అమ్మ చేతి వంటే ఇష్టంగా తింటాడు. ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటదంటారు. అలా నాన్న వెనుక అమ్మ జీవితం ఉంది. 
 

56

అంతేకాదు ఇంత మంది పిల్లలను కనింది. ఆల్మోస్ట్ మేం 13 మంది పిల్లలను కన్నది అమ్మ. అది ఎంతో పెయిన్‌. ఇలా అన్నీ చూసుకుంటే పాపం జీవితాంతం ఆమె నాన్న కోసం, కుటుంబం కోసం త్యాగం చేసిన ఒక పూణ్యాత్మురాలు. అన్ని సద్గుణాలు కలగలిపిన ఒక మహోన్నతమైన వ్యక్తి అమ్మగారు అంటూ ఎమోషనల్‌ అయ్యారు బాలయ్య. ఏబీఎన్‌తో ఇంటర్వ్యూలో బాలకృష్ణ ఈ విషయాలు వెల్లడించారు. ఎన్టీఆర్‌ జీవితం తమకు స్ఫూర్తి అని, ఆయన క్రమశిక్షణ, నిబద్దత, నిజాయితీ మేం పాటించేవాళ్లమని, ఆయన సినిమాలు రోజూ చూస్తానని తెలిపారు బాలయ్య. 
 

66

బాలకృష్ణ ప్రస్తుతం `ఎన్బీకే 109` చిత్రంలో నటిస్తున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో వచ్చే అవకాశం ఉంది. మరోవైపు బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేయబోతున్నారు. `బీబీ4`గా ఇది తెరకెక్కబోతుంది. వచ్చే నెలలో ప్రారంభం కానుందని తెలుస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories