రామ్‌గోపాల్‌ వర్మ కలియగం మొత్తం బతికే ఉంటాడా? నాగ్‌ అశ్విన్‌ వేసింది మామూలు బిస్కెట్ కాదు..

First Published Jul 6, 2024, 7:13 PM IST

`కల్కి 2898 ఏడీ` సినిమాలో ముగ్గురు దర్శకుడు రాజమౌళి, రామ్‌గోపాల్‌ వర్మ, అనుదీప్‌ మెరిశారు. అయితే వర్మని పెట్టడం వెనుక జరిగిన కథేంటో బయటపెట్టాడు నాగ్‌ అశ్విన్‌. 
 

Nag Ashwin

దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఇప్పుడు ఇండియన్‌ టాప్‌ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు. `కల్కి 2898 ఏడీ`తో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇండియన్‌ సినిమాలోనే ఇప్పటి వరకు ఎవరూ చేయని సాహసం చేసి సక్సెస్‌ అయ్యారు. మహాభారతంలోని మైథలాజికల్‌ అంశాలను సైన్స్ ఫిక్షన్‌తో ముడిపెట్టి ఈ మూవీని తెరకెక్కించారు. కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ సినిమాకి బాగానే ఆదరణ దక్కుతుంది. దీనికితోడు భారీ వసూళ్లని రాబడుతుండటం విశేషం. ఆల్మోస్ట్ ఈ సినిమా ఇప్పటికే అన్ని చోట్ల బ్రేక్‌ ఈవెన్‌ అయ్యిందని తెలుస్తుంది. బయ్యర్లు అంతా సేఫ్‌ జోన్‌లోకి వెళ్లారని, ఇక వచ్చేదంతా లాభాలే  అనే ట్రేడ్‌ వర్గాల సమాచారం. ఓవరాల్‌గా ఈ సినిమా ఎలా పర్‌ఫెర్మ్‌ చేస్తుందనేది, ఎంత వరకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది.
 

ఇదిలా ఉంటే  `కల్కి` సినిమాలో చాలా మందిస్టార్స్  గెస్ట్ లుగా మెరిశారు. అందులో రాజమౌళి, రామ్‌ గోపాల్‌ వర్మ, అనుదీప్‌, ఫరియా అబ్దుల్లా, దుల్కర్‌ సల్మాన్‌, విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ వంటి వారున్నారు.  అయితే ఇందులో రాజమౌళి,  వర్మ, అనుదీప్ లు మెరవడం ఆశ్చర్యంగా అనిపించింది. థియేటర్లో వాళ్లు కనిపించినప్పుడు ఆడియెన్స్ అరుపులు మామూలుగా లేవు. ఎప్పుడూ కనిపించని వాళ్లు ఇలా సడెన్ గా మెరిస్తే సర్‌ప్రైజింగ్‌గానే ఉంటుంది.  
 

Latest Videos


ఈ నేపథ్యంలో  దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ శుక్రవారం `కల్కి` సెట్‌లో ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. ఇందులో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌.  కొమియో పాత్రలకు సంబంధించి ఆయన మాట్లాడుతూ రాజమౌళి, ఆర్జీవీ వంటి ఇండియన్‌ సినిమా మేకింగ్‌ ని  మార్చేసిన వ్యక్తులు. వారిని  ఇందులో పెట్టడం వారికి ఒకట్రిబ్యూట్‌ లాంటిది అన్నారు నాగ్‌ అశ్విన్‌. వారితో పనిచేయడం గొప్ప అవకాశం, అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలో మరో ఆసక్తికర కామెంట్‌ చేశారు. రామ్‌ గోపాల్‌ వర్మని తీసుకోవడం గురించి చెబుతూ 
 

ఈ సినిమాలో నటించాలని నాగ్‌ అశ్విన్‌ అడిగినప్పుడు అసలు నేను ఎందుకు నటించాలని అని వర్మ అడిగారట. దానికి  నాగ్‌ అశ్విన్‌ వేసిన బిస్కెట్‌ మామూలు కాదు. ఇది హైలైట్‌ అని చెప్పొచ్చు. `మీరు కలియుగం మొత్తం ఉంటారేమో అనిపిస్తుంది సర్‌ అన్నాడట నాగ్‌ అశ్విన్‌. దెబ్బకి వర్మకి మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. మరో మాట లేకుండా షూటింగ్‌కి వస్తున్నా అని చెప్పాడట. అలా వచ్చి మెరుపు తీగలా మెరిసి వెళ్లిపోయారు. ఆయన వచ్చినప్పుడు థియేటర్లలో అరుపులు మామూలుగా లేవని చెప్పొచ్చు. 
 

వర్మనే మాటల విషయంలో తోపు అంటారు. బోల్డ్ నెస్‌ విషయంలో ఆయన్ని మించిన వాళ్లు లేరు. ఆయనకు సోప్‌ వేయడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ నాగ్‌ అశ్విన్‌ అన్న ఆ ఒక్క మాటతో వర్మ ఇంకో మాట లేకుండా వచ్చి ఫస్ట్ టైమ్‌ యాక్ట్ చేసి వెళ్లిపోయాడు. ప్రభాస్‌తో వర్మ సీన్‌ ఉంటుందనే విషయం తెలిసిందే. తను కాంప్లెక్స్ నుంచి వచ్చిన గుడ్డు(ఎగ్‌)ని భైరవకి అమ్మి వెళ్తాడు. చాలా ఎక్కువ అమౌంట్‌ చెప్పగా, ప్రభాస్‌ వామ్మో అంటారు, నీకు అంత సీన్‌ లేదు, చల్‌ దొబ్బేయ్‌ అని తన దైన లాంగ్వేజ్‌తోనే వర్మ డైలాగ్‌ చెప్పడం ఆకట్టుకుంది.

సినిమాలో వర్మ సీన్‌ బాగా పేల్చింది. అలాగే ఆ తర్వాత రాజమౌళి కూడా వచ్చారు. ఆ సీన్‌ లో ప్రభాస్‌తో సినిమాలు చేయడానికి సంబంధించిన పరోక్షంగా డైలాగ్‌ చెప్పించారు. ఈ సారి దొరికితే పదేళ్లు తొక్కుతా అంటూ రాజమౌళి ఫైర్‌ కావడం నవ్వులు పూయించింది. అలాగే కాంప్లెక్స్ లో అనుదీప్‌ కనిపించి `జాతిరత్నాలు` బ్రాండ్‌ సైన్‌ తో అలరించారు. ఇలా ఈ ముగ్గురు మెరిసి ప్రత్యేక ఆకర్షణలు నిలిచారు. అయితే సినిమా కథలో వీరి పాత్రలకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. సంబంధం లేదు. కానీ జస్ట్ కావాలని స్పెషల్‌ ఎట్రాక్షన్‌ కోసం నాగ్‌ అశ్విన్‌ ఈ ముగ్గురిని పెట్టినట్టు అనిపిస్తుంది. 
 

click me!