అయితే దీనిపై అప్పట్లోనే శిరీష్ స్పందించారు. ఆయన వరకట్నం కోసం వేదిస్తున్నారనేది నిజం కాదని, అవి తప్పుడు ఆరోపణలు అని, దానికోసమే కోర్ట్ కి వెళ్లామని, కోర్ట్ లో అది తప్పు అని తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు శిరీష్. అయితే శ్రీజ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటనేది ప్రశ్నకి ఆయన చెబుతూ, ఆ విషయం శ్రీజనే అడగాలని చెప్పారు. ఆమె ఎందుకు ఇలా చేసిందో తెలియదని, అసలు కారణం తెలియదని, అయితే ఇది తమ లైఫ్‌లో చిన్న డిస్టర్బెన్స్ మాత్రమే అని, సెట్ అవుతుందని భావిస్తున్నట్టు తెలిపారు శిరీష్.