బాలయ్య సినిమాల లైనప్‌ చూస్తే మతిపోవాల్సిందే.. ఇది మామూలు దూకుడు కాదు..

Published : Feb 20, 2024, 11:05 PM ISTUpdated : Feb 21, 2024, 12:13 PM IST

బాలయ్య నెక్ట్స్ సినిమాల లైనప్‌ మామూలుగా లేదు. అంతా కుర్ర దర్శకులతోనే సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆ విషయాలు ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తున్నాయి.   

PREV
16
బాలయ్య సినిమాల లైనప్‌ చూస్తే మతిపోవాల్సిందే.. ఇది మామూలు దూకుడు కాదు..

 బాలకృష్ణ మొన్నటి వరకు సీనియర్‌ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ రాను రాను రూట్‌ మారుస్తున్నారు. యంగ్‌ డైరెక్టర్లని ఎంకరేజ్‌ చేస్తున్నారు. కొత్తగా ఆయన జాబితాలో మరో దర్శకుడు చేరాడు. అంతేకాదు బాలయ్య నెక్ట్స్ సినిమాల లైనప్‌ మాత్రం అదిరిపోయేలా ఉంది. చాలా పక్కగా ప్లాన్‌ చేస్తున్నారు ఈ సీరియర్‌ హీరో. ఆ లైనప్‌ ఏంటో చూస్తే..

26

బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో `ఎన్బీకే109` చిత్రంలో నటిస్తున్నారు. బాబీ యంగ్‌ డైరెక్టర్ల జాబితాకే చెందుతారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతుంది. భారీ బడ్జెట్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ దసరాకి గానీ మూవీ వచ్చే అవకాశాలున్నాయి. లేదంటే డిసెంబర్‌ కి ప్లాన్‌ జరుగుతున్నట్టు తెలుస్తుంది. 

36

నెక్ట్స్ కుర్రాళ్లకి ఓకే చెబుతున్నారట బాలయ్య. అందులో భాగంగా `హనుమాన్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. వీరిద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయి. బాలయ్య చేసే టాక్‌ షో `అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే` షోని డైరెక్ట్ చేసింది ప్రశాంత వర్మనే. దీంతో ఆ టైమ్‌ నుంచే ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఓ కథ కూడా ఫైనల్‌ అయ్యిందని సమాచారం. ప్రస్తుతం ప్రశాంత్‌ వర్మ `జై హనుమాన్‌` చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఆ తర్వాత బాలయ్య మూవీ ఉండే అవకాశం ఉంది. సుధాకర్‌ చెరుకూరి నిర్మించనున్నట్టు సమాచారం. 

46

దీంతోపాటు తాజాగా మరో కొత్త డైరెక్టర్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట బాలయ్య. `టాక్సీవాలా`, `శ్యామ్‌ సింగరాయ్‌` ఫేమ్‌ రాహుల్‌ సాంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారట. బాలయ్య కోసం పీరియడ్‌ డ్రామా స్క్రిప్ట్ ని రాశాడట దర్శకుడు. బాలయ్యకి నెరేట్‌ చేశాడని, ఆయన సర్ప్రైజ్‌ అయ్యాడని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ కూడా ఓకే అయ్యిందనే వార్తలు ఫిల్మ్ నగర్‌ సర్కిల్‌లో, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 

56

అలాగే తనకు `భగవంత్‌ కేసరి` వంటి హిట్‌ని అందించిన అనిల్‌ రావిపూడితోనూ సినిమా చేయబోతున్నారట. ఈ మూవీ సమయంలోనే దర్శకుడితో మరో సినిమా చేస్తానని ప్రకటించారు. అనిల్‌ రావిపూడి కూడా ఆ విషయాన్ని చెబుతూ వచ్చారు. అన్నట్టుగానే నెక్ట్స్ ఒక కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ చేయబోతున్నారట. మరోవైపు `ఆదిత్య999`కోసం ఓ యంగ్‌ డైరెక్టర్‌ నే చూస్తున్నారట బాలయ్య. 

66

దీంతోపాటు ఇద్దరు సీనియర్‌ దర్శకులు కూడా బాలయ్య జాబితాలో ఉన్నారు. వారిలో బోయపాటి శ్రీను ఒకరు. తనకు `సింహా`, `లెజెండ్‌`, `అఖండ` వంటి హ్యాట్రిక్‌ హిట్‌ చిత్రాలను అందించారు బోయపాటి. ఇంకా చెప్పాలంటే ఈ పదేళ్లలో ఆయన ఇచ్చిన మూడు హిట్లే బాలయ్యని నిలబెట్టాయి. బోయపాటి వల్లే ఆయన రేంజ్‌ కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు `అఖండ 2` కూడా ప్లాన్‌లో ఉంది. నెక్ట్స్ ఆ మూవీని కూడా తెరకెక్కించే అవకాశం ఉంది. దీంతోపాటు హరీష్‌ శంకర్‌తోనూ మొదటిసారి ఓ సినిమా చేయబోతున్నారట. ఇలా ఐదారు సినిమాల లైనప్‌తో బాలయ్య ఫుల్‌ బిజీగా ఉన్నారు. అంతేకాదు, ఇందులో ఒక్కరు తప్ప అంతా యంగ్‌ డైరెక్టర్సే కావడం విశేషం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories